అదే జరిగితే చరిత్రలో చంద్రబాబు

Published: Friday December 17, 2021
 

తిరుపతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): à°¤à°¿à°°à±à°ªà°¤à°¿à°²à±‹ నేడు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు శివారెడ్డి, రాయపాటి శైలజ, తిరుపతిరావు, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఏర్పాట్లకు సహకరిస్తున్నారు. బహిరంగసభ చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటవుతున్నందున స్థానిక టీడీపీ ఇంఛార్జి పులివర్తి నానీ సభ ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలసి అక్కడే మకాం వేశారు. సభా ప్రాంగణాన్ని, వాహనాల పార్కింగ్‌ కోసం, ఫుడ్‌ కోర్టు ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాలను దగ్గరుండి  చదును చేయించారు. వేదిక ఏర్పాట్లు, గ్యాలరీలు, బ్యారికేడ్ల ఏర్పాటు వంటి పనులను పర్యవేక్షించారు.

 

మరోవైపు.. మాజీ మంత్రి అమరనాధరెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు టీడీపీ ఇంఛార్జులు బొజ్జల సుధీర్‌రెడ్డి, గాలి భానుప్రకాష్‌, జేడీ రాజశేఖర్‌, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు మాల్యాద్రి, మద్దిపట్ల సూర్యప్రకాష్‌, గాలి చిన్నబాబు, సీపీఐ జిల్లా నేతలు రామానాయుడు, కుమార్‌రెడ్డి తదితరులు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.సుమారు పాతిక వేల మంది సభకు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిలో తిరుచానూరు సమీపాన దామినీడు దగ్గరున్న గజలక్ష్మీ గ్రీన్‌ సిటీ వద్ద రోడ్డుకు ఉత్తర దిశగా సభాస్థలిని ఖరారు చేశారు. పది ఎకరాలు సభా ప్రాంగణానికి, వాహనాల పార్కింగ్‌కు మరో పది ఎకరాలు, ఫుడ్‌ కోర్టు కోసం ఐదు ఎకరాలు చొప్పున కేటాయించారు. బహిరంగసభ మధ్యాహ్నం 2 గంటలకే ప్రారంభం కానున్నందున అంతకంటే ముందుగానూ, సభ సమయానికి వచ్చే ప్రజలు ఆకలికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 30 వేల మందికి పైగా సరిపడా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. సభలో పాతిక వేల కుర్చీలు, లక్షన్నర వాటర్‌ బాటిళ్ళు అందుబాటులో వుంచుతున్నారు. ప్రాంగణంలో 1800 ఫ్లడ్‌ లైట్లు అమర్చుతున్నారు. సాయంత్రం 6 గంటల్లోపు సభ ముగించాలి కనుక ఎల్‌ఈడీ స్ర్కీన్ల ఏర్పాటు విషయంలో నిర్వాహకులు పునరాలోచనలో పడ్డారు. పరిరక్షణ సమితి నేతలు, వివిధ పార్టీల ముఖ్యనేతలు ఆశీనులయ్యే వేదికను వంద మందికి సరిపోయేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణంలో తొక్కిసలాటలు జరగకుండా మధ్యలో రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారికేడ్లు అమర్చుతున్నారు.

 

పలువురు ప్రముఖుల రాక..

టీడీపీ అధినేత చంద్రబాబు సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పలువురు సభకు హాజరు కానున్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రకటించి నేటితో సరిగ్గా రెండేళ్ళవుతున్న తరుణంలో అమరావతి పరిరక్షణ సమితి ఈ సభ నిర్వహిస్తోంది. అదే సమయంలో అమరావతి పరిరక్షణ పేరిట రెండేళ్ళ నుంచీ ఉద్యమం కొనసాగిస్తున్న రాజధాని రైతులు తాజాగా 44 రోజుల పాటు సాగించిన మహా పాదయాత్రను ఈనెల 14న తిరుపతిలో ముగించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా తమ ఉద్యమ, పాదయాత్రల ఉద్దేశాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో రాజధాని రైతులు ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రవాసాంధ్రులు ఈ సభ పట్ల, తదనంతర పరిణామాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ బహిరంగసభకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది.

 

కాంగ్రెస్‌ నుంచీ పీసీసీ అధ్యక్షుడు  తులసిరెడ్డి, సీపీఐ నుంచీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు హాజరవుతారని తెలిసింది. బీజేపీ,  సీపీఎం,జనసేన పార్టీల నుంచీ సభకు ఎవరు హాజరవుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనసేన నుంచీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ లేదా ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌లలో ఎవరో ఒకరు హాజరవుతారని చెబుతున్నారు.వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ నుంచీ వర్చువల్‌à°—à°¾ పాల్గొని ప్రసంగిస్తారని తెలిసింది.