మీ మాట మేమెందుకు వినాలి?

Published: Sunday December 19, 2021

 à°ªà°¨à°¿à°•à±ˆà°¨à°¾ ప్రజలు వలంటీర్లనే సంప్రదిస్తున్నారు. సంక్షేమ పథకాలకైనా... సమస్యల పరిష్కారానికైనా వారినే ఆశ్రయిస్తున్నారు. అధికారులు కూడా వలంటీర్ల సేవలే వినియోగించుకుంటున్నారు.అలాంటప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న మేమెందుకు? మరోవైపు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. కేంద్రం అందించే నిధులను పక్క దారి పట్టిస్తోంది. విధులు, హక్కులను హరిస్తోంది’.. అంటూ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరం గంగానే తమ బాధను వెళ్లగక్కుతున్నారు. కొన్ని నెలల కిందట పూసపాటిరేగలో ఏకం à°—à°¾ సమావేశం నిర్వహించి à°¤ à°® ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా శుక్రవారం బొబ్బిలి మండల పరిషత సర్వసభ్య సమావే శంలో ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పల నాయుడు సమక్షంలోనే తమ గళం విప్పారు. విపక్ష సర్పంచ్‌లతో అధికార పక్షం వారు సైతం గొంతు కలపడం చర్చనీయాంశమైంది. జిల్లాలో 960 పంచాయతీలు ఉన్నాయి. 664 సచివాలయా లు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమించింది. పేరుకే నోటిఫికేషన, ఎంపిక ప్రక్రియ కానీ.. అధికార పార్టీ వారినే నియమించారన్నది బహిరంగ రహస్యం. ఆది నుంచి ప్రభుత్వం వలంటీర్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. స్థానిక ఎన్నికల్లో వారి సహకారంతో మంచి ఫలితాలనే సాధించింది. దీంతో వారి విధుల పరిధిని పెంచింది.

à°ˆ ఏడాది మార్చిలో పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో సర్పంచ్‌లు కొలువుదీరారు. కానీ నిధులు లేకపోవడం, అంతా సచివాలయ కార్యాలయాల కనుసన్నల్లో జరగడం, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వలంటీర్లు నిలవడంతో సర్పంచ్‌లకు ప్రాధాన్యం దక్కడలేదు. గతం తో పోల్చుకుంటే వారి పరప తి తగ్గింది. దీనికితోడు కేం ద్ర ప్రభుత్వం పంచాయ తీలకు అందించే ఆర్థిక సం ఘం నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది.ప్రజలు అడుగు తున్న ఏ చిన్న పనీ చేయలేని స్థితిలో ఉండడంతో సర్పం చల్లో నిర్వేదం పెరుగుతోంది. ప్రజలకు ఏదో చేయ్యాలని ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే ఇదేమిటీ పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారు.  ప్రజల్లో పలుచనైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు ఉత్సవ విగ్రహాలన్న వ్యాఖ్యలు ఉండేవి. ఇప్పుడు అదే కోవలోకి సర్పంచ్‌లు చేరుతున్నారు. పంచాయతీ ప్రథమ పౌరుడుగా సర్పంచ్‌కు విశేష అధికారాలు ఉండేవి. రాజ్యాంగబద్ధంగా హక్కులు, విధులు, నిధులు ఉండేవి. కానీ ఒక్కొక్కటీ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. సర్పంచ్‌లకు సమాంతరంగా వ్యవస్థలను తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దేశ ప్రధాని అయినా..రాషా్ట్రనికి సీఎం అయినా గ్రామ పంచాయతీల్లో పర్యటించేటప్పుడు ప్రోటోకాల్‌ ప్రకారం తొలుత ఆహ్వానం అందేది సర్పంచ్‌కే. అందుకే దశాబ్దాలుగా  ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 15 నాడు జాతీయ జెండా ఆవిష్కరించే అరుదైన అవకాశం సర్పంచ్‌లకే ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వం à°† హక్కునూ కాలరాసిందన్న ఆవేదన సర్పంచుల్లో ఏర్పడింది. ఎన్నికల ముందు స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం...నిధులు మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చిన సీఎం జగన ఇప్పుడు ఒక్కో అధికారాన్ని దూరం చేయడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే సమావేశాల్లో గళం విప్పుతున్నారు.