షాపింగ్‌ మాల్స్‌లో ఆఫర్ల జోరు

Published: Saturday June 23, 2018

ఒకప్పు డు ఆషాడమాసం వచ్చిందంటే బట్టల షాపుల యజమానులు ఆఫర్లు పెట్టేవారు. వినియోగదారులు క్యూలో నిలబడి ఇంట్లో అవసరం ఉన్నా లేక పోయినా కొని దాచుకునే వారు. ఇప్పుడు షాపింగ్‌ మాల్స్‌ రాజ్యం నడుస్తోంది. వీటిలోకి అడుగు పెడితే చాలు... ఎంఆర్‌పీ ఇంత... డిస్కౌంట్‌ ఇంత అనే బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో అవసరం లేకపోయినా డిస్కౌంట్‌ అని కొనేస్తున్నారు. వీటిల్లో అగ్రస్థానం కూల్‌డ్రింక్స్‌, నూడిల్స్‌ వంటివి ఉన్నా యి. అసలు అవసరమైంది కొందామని లోపలికి వెళ్లిన వారికి ఆఫర్లు చూపి అది మరచిపోయి మిగిలినవి కొనేస్తున్నారు. పిల్లలకు రూ.5 పెట్టి చాక్లెట్‌లు కొనిపించని తల్లిదండ్రులు కూడా షాపింగ్‌ మాల్‌కు వెళ్లి రూ.50 డిస్కౌంట్‌ ఉందని చాక్లెట్‌à°² డబ్బాలు కొంటున్నారు. ఇవేకాదు ఇటీవల నాలుగు కూల్‌డ్రింక్స్‌ కంపెనీల రేట్లు వీధి షాపుల్లో దొరికే దాని కన్నా 20 శాతం వరకు తక్కువ పెట్టారు. దీంతో రోజుకు లారీల్లో డ్రింక్స్‌ ఆయా షాపింగ్‌ మాల్స్‌ అమ్ముడయ్యాయి. వచ్చిన ప్రతి ఒక్కరు à°“ ప్యాకెట్‌ తీసుకువెళ్లారు. ఇంట్లో దాని అవసరం ఉన్నా లేకపోయినా డిస్కౌంట్‌ అనేసరికి కొనుగోలు చేస్తున్నారు.