కరెంటు వినియోగదారులపై అభివృద్ధి చార్జీల మోత

Published: Tuesday January 04, 2022

à°šà°¿ అభ్యంతరాలు సేకరించింది. అయితే.. ఇందుకు సంబంధించి బహుళ ప్రచారం లేకపోవడంతో.. రాష్ట్రంతో సంబంఽధం లేని హైదరాబాద్‌ వాసులు.. ఇతర ప్రాంతాలకు చెందిన వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పది కంటే తక్కువ సంఖ్యలోనే అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. ఈఆర్‌సీ వాటిని పరిగణనలోకి తీసేసుకుంది. అభివృద్ధి చార్జీలను పెంచుకునేందుకు డిస్కమ్‌లకు అవకాశం ఇచ్చేసింది.

 

ప్రస్తుతం గృహ విద్యుత్‌ కనెక్షన్ల నుంచి 500 యూనిట్ల వరకూ రూ.500 చొప్పున డెవల్‌పమెంట్‌ చార్జీగా వసూలు చేస్తున్నారు. దీనిని రూ.1,000à°•à°¿ పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించగా.. ఏపీఈఆర్‌సీ రూ.800à°•à°¿ ఆమోద ముద్ర వేసింది. అంటే రూ.300 పెంచిందన్న మాట. అదేవిధంగా 501-1,000 యూనిట్ల వరకూ ప్రస్తుతం రూ.1,200 వసూలు చేస్తుండగా.. దానిని 1,500à°•à°¿  పెంచాలన్న ప్రతిపాదనను ఈఆర్‌సీ ఆమోదించింది. 1,000యూనిట్లకు మించిన కనెక్షన్లకు రూ.1,200 కనీస అభివృద్ధి చార్జీగా.. 1,000 యూనిట్లు దాటాక వాడే ప్రతి యూనిట్‌కు రూ.1,200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సదరు కనెక్షన్‌దారు దరఖాస్తు సమయంలో రూ.2,500 డెవల్‌పమెంట్‌ చార్జీగా చెల్లించాలని.. 1,000 యూనిట్లు దాటాక వాడే ప్రతి యూనిట్‌కు రూ.2,500 వసూలు చేసుకుంటామని డిస్కమ్‌లు ప్రతిపాదించగా.. ఈఆర్‌సీ à°† చార్జీలను  రూ.1,500.. రూ.2,000à°—à°¾ నిర్ధారించింది. కాగా, నెలకు 250 యూనిట్లు వాడే గృహేతర విద్యుత్‌ కనెక్షన్‌కు అభివృద్ధి చార్జీ à°•à°¿à°‚à°¦ రూ.300 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రూ.600à°•à°¿ పెంచేశారు. 251-500 యూనట్ల వరకూ వినియోగించే మధ్యస్థాయి వినియోగదారుల నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు.

 

దానిని రూ.1,250à°•à°¿ పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించగా.. ఈఆర్‌సీ రూ.800à°•à°¿ తగ్గించింది. 501-1,000 వాట్ల వరకూ వాడేవారికి డెవల్‌పమెంట్‌ చార్జీని రూ.1,200 నుంచి రూ.1,500కు పెంచారు. 1,000 వాట్ల కంటే ఎక్కువ వాడేవారి నుంచి కనీసంగా రూ.1,200.. à°† తర్వాత ప్రతి కిలోవాట్‌కు రూ.1,200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈఆర్‌సీ కనీస చార్జీని రూ.1,500à°•à°¿ పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఆపై ప్రతి కిలోవాట్‌కు రూ.2000 చొప్పున వసూలు చేసుకుందుకు అనుమతించింది.