కాశీ విశ్వనాథ ఆలయం సిబ్బందికి మోదీ కానుక

Published: Monday January 10, 2022

ప్రధాని నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథ ఆలయం సిబ్బందికి జనపనారతో చేసిన 100 జతల పాదరక్షలు పంపారు. రబ్బరు, తోలుతో చేసిన పాదరక్షలను ఆలయం ఆవరణలోకి అనుమతించరు. à°† కారణంగా చాలా మంది సిబ్బంది పాదరక్షలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారనే విషయం మోదీ దృష్టికి రావడంతో ఆయన తక్షణం స్పందించారు. జూట్‌తో చేసిన పాదరక్షలను పంపారు. ఆలయ పూజారులు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు, సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ వర్కర్లు, ఇతరుల కోసం à°ˆ పాదరక్షలను ప్రధాని పంపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందువల్ల గడ్డకట్టే చలిలో పాదరక్షలు లేకుండా విధులు నిర్వహించే సిబ్బందికి  ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నాయి. ''కాశీ విశ్వనాథ ఆలయంతో ముడిపడిన సమస్యలు, వారణాసి అభివృద్ధిపై ప్రధాని మోదీ అనుక్షణం దృష్టి సారిస్తున్నారు. పేదల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం'' అని ఆలయ అధికారి ఒకరు తెలిపారు. విశ్వనాథ్ థామ్ తొలి ఫేజ్‌ను ప్రధాని à°—à°¤ నెలలో ప్రారంభించారు.