న్యాయం కోరితే శిక్ష..!

Published: Thursday January 13, 2022

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కారు షాక్‌ ఇచ్చింది. న్యాయం కోసం నిరసన తెలిపిన ఉద్యోగులకు జీతం కట్‌ చేయడంతోపాటు, క్రమశిక్షణ చర్యలకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మెమో ఇచ్చిన అధి కారులు, తాజాగా బుధవారం జీతం కట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రొద్దం మండలంలో 145 మందికి ఈనెల 10à°µ తేదీకి సంబంధించిన జీతం నిలిపివేయాలంటూ ఎంపీడీఓ ఉత్తర్వులు జారీచేశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మెమో జారీచేశారు. 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలనీ, లేకుంటే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సచివాలయ ఉద్యోగులతోపాటు, ఇతర à°‰ ద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈనెల 10à°¨ జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లావ్యాప్తంగా 63 మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని ఉద్యోగులు నిరసన తెలిపారు.  ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు వినతిపత్రాలు అందించారు. 24 గంటలు తిరక్కుండానే వారిపై వేధింపులు మొదలయ్యాయి. కొందరు ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. విధులకు గైర్హాజరైనందుకు రొద్దం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్‌-5, సచివాలయ ఉద్యోగులు ఏకంగా 145 మందికి 10à°µ తేదీ జీతం నిలిపివేస్తూ ఎంపీడీఓ రాబర్ట్‌ విల్సన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డీడీఓలు 10వతేదీ జీతాలు చెల్లిస్తే వారిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసు కుంటామన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో సైతం ఈనెల 11à°µ తేదీ మున్సిపాలిటీ పరిధిలోని 11 సచివాలయాల్లోని ఉద్యోగులపై చర్యలకు దిగారు. అందరికీ మెమో జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్‌ అథారిటీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సామూహిక విధుల బహిష్కరణ, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేయడం, ఓటీఎస్‌ మేళాలో పాల్గొనకపోవడం, అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌à°² నుంచి వైదొలగడం వంటి 4 అంశాలపై 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ కమిషనర్‌ మెమో జారీ చేశారు. బెళుగుప్పలో 134 మందికి ఒకరోజు జీతం కట్‌ చేస్తామని చెప్పినట్లు సమాచారం.