గోదావరిలో బరులు సిద్ధం

Published: Friday January 14, 2022

సంక్రాంతి పండగ మూడురోజులు కోడిపందేలు భారీస్థాయిలో ఆడించడానికి ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార పార్టీ నేతల అనుచరులు, పందెంరాయుళ్లు ఏర్పాట్లు పూర్తిచేశారు. తూర్పుగోదావరిలో కాకినాడ సిటీ మినహా 18 నియోజకవర్గాల్లో à°“ మోస్తరు నుంచి రాష్ట్ర స్థాయి పందేలకు బరులు సిద్ధమయ్యాయి. ఒక్క కోనసీమలోనే 14 మండలాల్లో కనీవినీ ఎరుగని రీతిలో పందేలు ఆడించడానికి బరులు సిద్ధం చేశారు. కొబ్బరితోటల్లో ఏర్పాటు చేసిన ఒక్కో బరి కనీసం రెండెకరాలు ఉంది. మధ్యలో కోడిపందేలకు, చుట్టూ బారికేడ్లు నిర్మించారు. వేలమంది కూర్చోడానికి క్రికెట్‌ స్టేడియం తరహాలో చెక్క మెట్లు కట్టారు. రౌండు రౌండుకూ పందేలు జరుగుతున్న తీరు వివరించడానికి లౌడ్‌స్పీకర్లు, లైవ్‌లో తనివితీరా చూసేందుకు పెద్దస్ర్కీన్లు బిగించారు. డ్రోన్‌ కెమెరాలతోను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేశారు. రాత్రిళ్లు సైతం కొనసాగించేందుకు ఫ్లడ్‌లైట్లు బిగించారు. జనరేటర్లు మోహరించారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో రాష్ట్రస్థాయిలోనే అతిపెద్ద పందేలు జరగనున్నాయి. మినీ క్రికెట్‌ స్టేడియంను తలపించే రీతిలో రూపొందించిన à°ˆ బరికి నిర్వాహకుడు à°“ సినిమా పేరు పెట్టుకున్నాడు. రోజుకు 15 రౌండ్ల చొప్పున మూడు రోజుల పాటు 45రౌండ్ల కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారా లు, ఫ్లడ్‌లైట్లు, మద్యం దుకాణాలు, దాబాలు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.

 

ఇక్కడ జరగనున్న పందేలకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. పాస్‌లు తీసుకున్నవారికి మినహా మరెవరికీ ప్రవేశం ఉండదు. వీఐపీ గ్యాలరీలతోపాటు సందర్శకుల గ్యాలరీని సిద్ధం చేశారు. సువిశాలమైన పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడకు పుంజులతో వచ్చేవారి నుంచి రోజుకు రూ.12కోట్ల చొప్పున మూడురోజులకు రూ.36కోట్లు బెట్టింగ్‌ మొత్తాలను వసూలు చేశారు. చూసేందుకు వచ్చేవారి నుంచి బెట్టింగ్‌à°² కోసం ముందుగానే అడ్వాన్స్‌లు తీసుకున్నారు. ఎక్కువసార్లు నెగ్గిన వారికి బహుమతిగా ఇన్నోవా కారును ఇవ్వనున్నారు. కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో అధిక పందేలు గెలుపొందిన విజేతలకు బుల్లెట్‌ను గిఫ్టుగా ఇవ్వనున్నట్లు తెలిసింది. కాకినాడ రూరల్‌, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, తుని, రామచంద్రపురం తదితర నియోజకవర్గాల్లోను భారీ బరులు సిద్ధమయ్యాయి. పందెరాయుళ్ల కోసం సకల హంగులూ సిద్ధం చేస్తున్నారు. ఇంకోవైపు.. నియోజకవర్గాల కీలక నేతల బంధువులే పందేలు, గుండాటకు అనుమతులు ఇస్తూ బరి స్థాయిని బట్టి రూ.50లక్షల నుంచి రూ.2కోట్ల వరకు సంపాదిస్తున్నారు. గుండాట నిర్వాహకుల మధ్య పోటీపెట్టి మరీ వేలంలో కేటాయిస్తున్నారు. అనపర్తిలో స్థానిక అధికార పార్టీ కీలక నేత బంధువు రూ.2కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి కోడిపందేల కంటే గుండాటల్లోనే కోట్లలో టర్నోవర్‌ జరుగుతుంది. à°ˆ లాభాల కోసమే కోడిపందేలను అధికార నేతలు కొందరు ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఈసారి కోడిపందేలకు అనుమతి లేదని, అవి నిర్వహించే ప్రాంతాల్లో వారంకిందట పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. అయినాపందెంరాయుళ్లు ఖాతరు చేయ à°¡à°‚ లేదు. కాకినాడ రూరల్‌లో à°“ కీలక నేత, కోనసీమలో మరో ముఖ్య నాయకుడు తమ అనుచరులు నిర్వహించే బరుల వైపు చూ డొద్దని పోలీసులకు హుకుం జారీచేశారు.