లత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

Published: Sunday February 06, 2022

గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ముంబై శివాజీపార్క్‌లో ఆమె భౌతిక కాయానికి అంతిమనివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన లత అంతిమ సంస్కారాలకు అభిమానులు, నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.