అస్తవ్యస్తం కానున్న ప్రజారోగ్య వ్యవస్థ

Published: Wednesday February 09, 2022

ఆరోగ్యశాఖలో బదిలీలు దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ఒకే స్టేషన్‌లో ఐదేళ్లు దాటిన ప్రతి వైద్యుడినీ, ఉద్యోగినీ బదిలీ చేస్తున్నారు. డీఎంఈ పరిధిలోని బోధనాసుపత్రుల్లో 60 శాతం మంది వైద్య, వైద్యేతర సిబ్బందికి స్థానచలనం కలగనుంది. డీహెచ్‌, ఏపీవీవీపీ (ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌)లోనూ ఇదేస్థాయిలో బదిలీలకు జాబితా సిద్ధమైంది. బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ, రేడియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియోథెరాసిక్‌ సర్జరీ తదితర సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో దాదాపు 100 శాతం వైద్యులు బదిలీ జాబితాలో చేరారు. ఇప్పటివరకూ డీఎంఈ అధికారులు సిద్ధం చేసిన జాబితా ప్రకారం 268 మంది ప్రొఫెసర్లు, 164 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 746 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 76 మంది ట్యూటర్లు బదిలీ కానున్నారు. ఒక్క డీఎంఈ విభాగంలోనే 1,276 మంది వైద్య సిబ్బంది బదిలీ జాబితాలో చేరారు. ఏపీవీవీపీలో 2,000 మంది బదిలీ కాబోతున్నారు. అందులో 600 మంది వైద్యులుంటారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లోనూ దాదాపు ఇంతే స్థాయిలో వైద్యులు బదిలీ కానున్నారు. ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాలు కలిపి ఒకేసారి 2,500 మంది వైద్యులు బదిలీ కాబోతున్నారు. వీరు కాకుండా రూరల్‌ ప్రాంతంలో మూడేళ్లు దాటిన వైద్యులు, గిరిజన ప్రాంతంలో రెండేళ్లు దాటిన వైద్యులు కూడా రిక్వెస్ట్‌ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తమకు ఇష్టంలేని చోట పని చేస్తున్న వారు రాష్ట్ర ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 30 శాతం మంది ఉన్నారు. ఐదేళ్లు దాటిన వారిని ప్రభుత్వమే బదిలీ చేస్తే, మూడేళ్ల దాటిన వారిలో 30 శాతం బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నారు. ఆరోగ్యశాఖలో ఒకేసారి à°ˆ స్థాయిలో బదిలీలు చేపడితే ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం ఉంది.  

గతంలో బదిలీల సమయంలో తప్పనిసరిగా స్టేషన్‌ మార్చే వారి సంఖ్యను 20 శాతానికి కుదించేవారు. ఏడెనిమిదేళ్లు ఒకే స్టేషన్‌లో విధులు నిర్వహించే సిబ్బందిని బదిలీల్లో చేర్చేవారు. ఇప్పుడు 20 శాతం సీలింగ్‌ను ఎత్తేశారు. ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్కరినీ బదిలీ చేయనున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా బదిలీలు చేపట్టడాన్ని వైద్యులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి అంటే పిల్లలు పరీక్షలు రాసే సమయం. à°ˆ సమయంలో బదిలీలు చేపడితే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  ముఖ్యంగా సూపర్‌ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్యులు à°ˆ సమయంలో బదిలీకి సిద్ధంగా లేరు. అవసరమైతే మెడికల్‌ లీవ్‌ పెట్టి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. 

ఒక్కొక్కరు 20 ఆప్షన్లు ఇవ్వొచ్చని జీవోలో పేర్కొన్నారు. 20 స్థానాలకు ఆప్షన్‌ ఇవ్వడం అంటే, ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగికి కూడా గుర్తుండదు.  తొలుత జనవరి 28à°¨ విడుదల చేసిన జీవో నంబరు 40లో మూడు స్థానాలకు మాత్రమే ఆప్షన్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. తర్వాత దాన్ని సవరించి 20 స్థానాలకు పెంచారు. దీనిపై వైద్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత మందికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే 20 ఆప్షన్లు అని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు. 

బదిలీల వల్ల డీఎంఈ పరిధిలోని బోధనాసుపత్రుల్లో అనేక సమస్యలు వస్తాయి. ఒక్కొక్క బోధనాసుపత్రిలో 150 నుంచి 250 మంది వైద్యులు బదిలీల జాబితాలో చేరారు. ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, కాకినాడ రంగరాయ, గుంటూరు మెడికల్‌ కాలేజీ, కర్నూలు మెడికల్‌ కాలేజీల్లో 250 మంది చొప్పున వైద్యులు ఒకేసారి బదిలీ కాబోతున్నారు. బదిలీ ఇష్టం లేని 40 శాతం మంది మెడికల్‌ లీవ్‌లో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలా మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్లకు ఎంసీఐ తనిఖీలు జరిగాయి. à°ˆ సమయంలో బదిలీలు చేస్తే చాలా వరకూ ఎంబీబీఎస్‌, పీజీ సీట్లు నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. కొత్త సీట్లూ కేటాయించే అవకాశం ఉండదు.