వైసీపీ కార్యకర్తల కవ్వింపు చర్యలు కారుమంచి గ్రామంలో ఉద్రిక్తత

Published: Sunday February 13, 2022

కారుమంచి గ్రామంలోని జెండా చెట్టు సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహంపై శుక్రవారం రాత్రి కొందరు వైసీపీకి చెందిన వ్యక్తులు తమ పార్టీ జెండాను ఎగురవేశారు. టీడీపీ ఫ్లెక్సీలను చింపి à°•à°¿à°‚à°¦ పడవేసి నానా భీభత్సం సృష్టించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వర్గీయులు పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్‌ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు లేళ్ళ లోకేశ్వరరావు, అనిల్‌కుమార్‌ గ్రామానికి చేరుకొని పరిశీలించారు. 

à°ˆ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అధికార పార్టీకి చెందినవారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామంలో అల్లర్లు సృష్టిస్తూ, గొడవలకు ప్రేరేపిస్తున్నారని అన్నారు. గతంలో టీడీపీ వర్గీయుల ఇళ్లపై రాళ్ళతో దాడి చేసి ఫెక్లీలను చింపివేసిన సీసీ కెమెరా పుటేజ్‌ను పోలీసులకు ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే à°ˆ రోజు à°ˆ పరిస్థితి తలెత్తేది కాదని టీడీపీ వర్గీయులు సీఐతో చెప్పి వాపోయారు. అనంతరం జరిగిన ఘటపై సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం డాగ్‌స్వాడ్‌ బృందం గ్రామంలో పర్యటించి ఆధారాలు సేకరించింది. పరిస్థితులు సద్దుమణిగేవరకు పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు సీఐ తెలిపారు. 

 

 à°µà°¿à°¨à±à°•à±Šà°‚à°¡ à°•à°¾à°°à±à°®à°‚చిలో వైసీపీ వికృత చేష్టలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం à°“ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. గతంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని ప్రజలపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కక్షసాధిస్తున్నారని తెలిపారు. కారుమంచి గ్రామంలో ఇప్పటికే అనేకసార్లు ఇటువంటి ఘటనలు వరుసగా జరిగినా పోలీసుల చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. 48 గంటల్లో నిందితులను దుపులోకి తీసుకోకపోతే కారుమంచి గ్రామంలో ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన దీక్ష తప్పదని హెచ్చరించారు.