ఏకంగా ఆర్టీసీ ఆస్తులకే ఎసరు

Published: Tuesday February 15, 2022

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అంటే.. ప్రభుత్వంలో భాగం అయిపోయామని ఉద్యోగులు సంబర పడ్డారు. అయితే ఏకంగా ఆర్టీసీ ఆస్తులకే ఎసరు పెడతారనుకోలేదు. జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండ్లలో ఖాళీగా ఉన్నాయంటూ కొన్ని స్థలాలను 33 యేళ్ళ పాటు లీజుకు ఇచ్చేస్తున్నారు. రూ.వందల కోట్ల ఆస్తులను అయినవాళ్లకు అప్పగించేందుకు అధికారికంగా కసరత్తు మొదలుపెట్టారు. 

ఒకప్పుడు పట్టణాలకు దూరంగా ఆర్టీసీ బస్టాండ్లు ఏర్పాటు చేశారు.నగరాలు, పట్టణాలు విస్తరించడంతో బస్టాండ్లన్నీ ఇప్పుడు నడిబొడ్డున ఉంటున్నాయి. దీంతో à°ˆ భూముల విలువ భారీగా పెరగడంతో అధికార పెద్దల కన్ను ఆర్టీసీ భూముల మీద పడింది. ఖాళీగా ఉన్న స్థలాలను లీజుకివ్వడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని సాకు చూపుతున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు రీజియన్‌ పరిధిలోని 9డిపోల్లోని ఖాళీస్థలాలను లీజుకు ఇచ్చేందుకు ఔత్సాహిక వ్యాపారవేత్తలతో ఆర్‌à°Žà°‚ చెంగల్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో సోమవారం అవగాహన సదస్సు జరిగింది.పీలేరు, పుత్తూరు, కలికిరి, ములకలచెరువు, పలమనేరు, శ్రీకాళహస్తి ప్రాంతాల నుంచి దాదాపు 35మంది వ్యాపారస్తులు హాజరయ్యారు. స్థలాల విస్తీర్ణం, లీజు ప్రమాణాలను వారికి ఆర్‌à°Žà°‚ వివరించారు.శ్రీకాళహస్తి, పుత్తూరు, కలికిరి, వాల్మీకిపురం, ములకలచెరువు, చిత్తూరు, పలమనేరు, కుప్పం బస్టాండ్లలో ఉన్న సుమారు 19 ఎకరాల స్థలాలను లీజుకు ఇవ్వనున్నారు. ఇవన్నీ కూడా వాణిజ్యపరంగా విలువైన భూములే. లీజు ప్రక్రియ మూడు విధానాల్లో ఉంటుంది. బిల్ట్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌(బీవోటీ) à°•à°¿à°‚à°¦ 33సంవత్సరాలు లీజు కాలం ఉంటుంది. ఆయా ప్రాంతంలోని మార్కెట్‌ విలువలో 5 శాతం ఏడాది అద్దెగా నిర్ణయిస్తారు. అంటే సుమారు రూ.50 లక్షల మార్కెట్‌ ధర ఉన్న స్థలానికి ఏడాదికి రూ2.5లక్షల అద్దె ఉంటుంది. సదరు స్థలంలో బిడ్‌ పొందిన వ్యక్తే నిర్మాణాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డిపాజిట్‌, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌పర్‌(డీవోటీ)లో 20సంవత్సరాలు లీజు సమయం ఉంటుంది. ఆర్టీసీనే గదులు నిర్మించి నెలసరి అద్దెప్రాతిదికన ఇవ్వనుంది. ఓపెన్‌ స్పేస్‌ స్టాల్స్‌ (ఓఎ్‌సఎస్‌) పద్ధతిలో  5సంవత్సరాల టెండర్‌ కాలపరిమితి ఉంటుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలే తాత్కాలిక షెడ్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది.

 

ఎక్కడ ఎంత భూమి?

- శ్రీకాళహస్తి బస్టాండులోని సౌత్‌-ఈ్‌స్ట కార్నర్లో 22 సెంట్ల స్థలాన్ని గుర్తించారు. ఇక్కడ ఉన్న కొన్ని షాపులను వేరేచోటకు మార్చి ఖాళీ స్థలాన్ని లీజుకు ఇవ్వనున్నారు. ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే శ్రీకాళహస్తి బస్టాండు స్థలానికి మంచి డిమాండ్‌ ఉంది. 

 

- జిల్లా కేంద్రమైన చిత్తూరు ఆర్టీసీ డిపో-1లో 2.15ఎకరాల విశాలమైన స్థలం ఉంది. ఏడాది కాలానికి రూ1.12కోట్ల అద్దె నిర్ణయించారు. చిత్తూరు బస్‌స్టేషన్‌ లోనూ 53 సెంట్ల ఖాళీస్థలాన్ని లీజుకు పెట్టారు. - పలమనేరులోనూ మూడు ప్రాంతాల్లో 3 ఎకరాలకు పైగా ఖాళీ  స్థలాలను గుర్తించారు.

 

- పీలేరులో బస్‌స్టేషన్‌-డీఎం కార్యాలయం నడుమ 1.62 ఎకరాలు, బస్‌డిపో నుంచి వారపుసంత  మధ్య 1.60 ఎకరాలు, చిత్తూరు హైవే రోడ్డువైపు 65 సెంట్ల స్థలాలను లీజుకు సిద్ధం చేశారు. 

 

- తిరుపతి, మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్లను స్థలాభావం వలన లీజుకు మినహాయించారు.

అవగాహన పేరుతో  సోమవారం జరిగిన సదస్సులో వ్యాపారవేత్తలు  కొన్ని డిమాండ్లను పెట్టారని తెలిసింది.  ములకలచెరువులో 2.98ఎకరాల లీజు స్థలంలో 33అడుగుల వెడల్పుతో రోడ్డు ఏర్పాటు చేయాలని, బీఓటీ నుంచి డీవోటీకి మార్పుచేయాలని కోరినట్లు తెలుస్తోంది.  అలాగే పీలేరులో 1.62, 1.6ఎకరాలు, పుత్తూరులో 2.4ఎకరాలు, కలికిరి 54సెంట్లను చిన్న చిన్న బిట్లుగా విభజించి ఇవ్వాలని కోరారు. శ్రీకాళహస్తిలో ట్రాన్స్‌ఫార్మర్‌ తొలగించి, 20అడుగుల రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. à°ˆ సూచనలను కేంద్ర కార్యాలయానికి నివేదిస్తారు. à°† తర్వాత టెండర్లను ఖరారు చేయనున్నారు. à°ˆ సదస్సులో డిప్యూటీ సీటీఎం మధుసూదన, పీవో పార్థసారథి, ఏఈ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.