కాంట్రాక్టర్లు, సరఫరాదారులకు చుక్కలుఆర్థిక సంవత్సరం ముగిస్తే.. మరింత కష్టం

Published: Sunday February 20, 2022

అక్కడా ఇక్కడా అప్పులు తెచ్చి... ప్రభుత్వానికి పనులు చేసి పెట్టిన కాంట్రాక్టర్లు, వెండర్లు బిల్లుల క్లియరెన్స్‌ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే సమర్పించిన బిల్లులకు డబ్బులు చెల్లించే సంగతి పక్కనపెడితే... అసలు బిల్లులే ఇవ్వకుండా ప్రభుత్వం గేట్లు మూసేసింది. ప్రస్తుతం జగన్‌ సర్కార్‌లో రూ.1,50,000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.60,000 కోట్లకు పైగా సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థలో ఉండగా, మిగిలినవి సీఎ్‌ఫఎంఎ్‌సలోకి వచ్చే అవకాశం లేక బయటే ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉండగానే, సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థలో బిల్లులు తీసుకునే సైటును ప్రభుత్వం మూసేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు (మార్చి 31) నాలుగైదు రోజుల ముందు కొత్త బిల్లులు తీసుకోవడం నిలిపివేస్తారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పద్ధతి మారింది. కొత్త బిల్లులకు నిధుల్లేక, వాటన్నింటినీ బడ్జెట్‌లో పెట్టకుండా ఎగ్గొట్టేందుకు... ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు నెలన్నర ముందు నుంచే బిల్లుల స్వీకరణ నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇది నాలుగో బడ్జెట్‌. à°—à°¤ మూడు బడ్జెట్లలోనూ జగన్‌ సర్కార్‌ పెండింగ్‌ బిల్లులను, వెయిటింగ్‌ ఫర్‌ ఫండ్‌ క్లియరెన్స్‌ బిల్లులకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఫలితంగా, ఆర్థిక సంవత్సరం మారితే à°† బిల్లులు ‘లైవ్‌’లో లేనట్లే. మళ్లీ à°† బిల్లులను లైవ్‌లోకి తెచ్చుకోవాలంటే సంబంధిత శాఖ నుంచి ఆర్థిక శాఖకు అదనపు బడ్జెట్‌ కోరుతూ ఫైలు రావాలి. à°ˆ ఫైళ్లు ఆయా శాఖలు వాటంతట అవి చేయవు. బిల్లు బాధితుడు విజ్ఞప్తి చేసుకుని దగ్గరుండి ఫైళ్లు పెట్టించుకుని ఆర్థిక శాఖలో ఆమోదింపజేసుకునే సరికి మళ్లీ కొత్త బడ్జెట్‌కు సమయం వస్తోంది. దీంతో మళ్లీ à°† బిల్లులు ల్యాప్స్‌ అవుతున్నాయి. మూడు బడ్జెట్ల నుంచి ఇదే జరుగుతోంది. పాత పెండింగ్‌ బిల్లులకు తోడు, కొత్తగా à°† ఏడాది జమ అయ్యే బిల్లులు కూడా చేరి వ్యవస్థలోకి ఎక్కని పెండింగ్‌ బిల్లులు కొండలా పేరుకుపోతున్నాయి.

 

à°—à°¡à°šà°¿à°¨ ఆర్థిక సంవత్సరంలోని పెండింగ్‌ బిల్లులకు, వెయిటింగ్‌ ఫర్‌ ఫండ్‌ క్లియరెన్స్‌ బిల్లులకు కొత్త బడ్జెట్లో మొట్టమొదటగా నిధులు కేటాయించాలి. ఇలా కేటాయించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ను ఉల్లంఘించడమే. పాత బిల్లులు చెల్లించకుండా కొత్త పనులకు బడ్జెట్‌ పెట్టడమనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మూడేళ్ల నుంచి జగన్‌ సర్కార్‌ యథేచ్ఛగా à°ˆ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఏ ఏడాదికి à°† ఏడాది బాధితులు వ్యయప్రయాసలు పడి అదనపు నిధుల ఫైలును ఓకే చేయించుకోవడం, ప్రభుత్వం సైటు మూసేయడం జరుగుతోంది. à°ˆ ఏడాది కూడా ప్రభుత్వం సరిగ్గా అదే పనిచేసింది. 

 

కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే అధికంగా వస్తాయి. పెండింగ్‌లో ఉన్న నిధులను కేం ద్రం à°šà°•à°šà°•à°¾ చెల్లిస్తుంది. కాంట్రాక్టర్లు, సరఫరాదారులు కూడా ఫిబ్రవరి, మా ర్చి నెలల్లో బిల్లులు ఎక్కువగా సమర్పిస్తుంటారు. à°ˆ రెండు నెలల్లో దాదాపు రూ.25,000 కోట్ల బిల్లులు వస్తాయని అంచనా. కానీ, కేంద్ర నిధులను ప్రభుత్వం వేర్వేరు అవసరాలకు వాడుకోవడంతో సమస్య వస్తోంది. à°† బి ల్లులు చెల్లించేందుకు నిధుల్లేక, వాటిని కొత్త బడ్జెట్‌లో పెట్టే ఉద్దేశం లేక బిల్లుల సైటు మూసేసి మోసం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

 

బిల్లుల సైటు మూసివేత ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేంద్రం ఇచ్చే నిధులపైనా పడుతోంది. చివరి త్రైమాసికంలో ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టినట్టుగా వివరాలు చూపిస్తేనే కేంద్రం తర్వాతి విడత నిధులు ఇస్తుంది. జగన్‌ సర్కార్‌ à°ˆ నిధులు మళ్లించేసింది కాబట్టి, ఖర్చుల వివరాలు చూపలేదు. దీంతో రావాల్సిన నిధులు ఆగిపోతాయి. 

 

కేంద్రం నుంచి పథకాలకు సంబంధించిన నిధులు రాష్ట్ర ఖజానాకు రాగానే... సంబంధిత ప్రాజెక్టు/పథకం అమలుకు ఆర్థిక శాఖ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్వో) ఇస్తుంది. ఉదాహరణ కు à°’à°• ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1000 కోట్లు విడుదలైతే... దానికి రాష్ట్రం వాటా (మ్యాచింగ్‌ గ్రాంటు) కలిపి పనులు చేసుకోవాలని ఆర్థిక శాఖ బీఆర్వో ఇస్తుంది.  à°† ప్రాజెక్టు అమలయ్యాక మొత్తం నిధులను ఆర్థిక శాఖ చెల్లించాలి. కానీ, రాష్ట్రంలో అలా జరగడం లేదు. కేంద్రం ఇచ్చిన రూ.1000 కోట్లను ప్రభుత్వమే వాడుకుంటోంది. మ్యాచింగ్‌ గ్రాంటు ఊసు ఉండటం లేదు. దీంతో బిల్లులు పెండింగ్‌లో పడుతున్నాయి. డబ్బులు à°‡ వ్వలేనప్పుడు బీఆర్వోలు జారీ చేసి, పనులు చేయించడం ఎందుకని బాధితులు లబోదిబోమంటున్నారు.