సంక్రాంతికి కొత్త రైల్లు

Published: Thursday January 04, 2018

సంక్రాంతి పండుగను, ఇతర ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 84 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీపీఆర్‌వో à°Žà°‚.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 

తిరుపతి - విశాఖపట్నం మధ్య ఏసీ ప్రత్యేక రైళ్లు... 07487 నెంబర్‌తో తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీలలో (ఆదివారాలు) రాత్రి 10.30 గంటలకు బయలుదేరి విశాఖపట్నంకి మరుసటిరోజు ఉదయం 10.45కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07488 విశాఖపట్నం - తిరుపతి రైలు జనవరి 8, 15, 22, 26, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీలలో (సోమవారం) రాత్రి 7.20కు బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 8.10కు తిరుపతికి చేరుకుంటుంది. à°ˆ రైళ్లకు అన్ని థర్డ్‌ ఏసీ కోచ్‌లే ఉంటాయి.

 

కాచీగూడ - విశాఖపట్నం వయా గుంటూరు, విజయవాడ... 07016 కాచీగూడ - విశాఖపట్నం రైలు ఫిబ్రవరి 6, 13, 20, 27 (ప్రతి మంగళవారం) సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి విశాఖపట్నానికి మరుసటిరోజు ఉదయం 7.50కు చేరుకుంటుంది.

 

విశాఖపట్నం - తిరుపతి... 07479 నెంబర్‌ à°—à°² రైలు ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీలలో (ప్రతి బుధవారం) రాత్రి 7.05కు బయలుదేరి తిరుపతికి మరుసటిరోజు ఉదయం 9.25కు చేరుకుంటుంది.

 

తిరుపతి - కాచీగూడ... 07146 తిరుపతి - కాచీగూడ రైలు జనవరి 8, 15, 22, మార్చి 1వ తేదీలలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు కాచీగూడకు చేరుకుంటుంది.

 

హైదరాబాద్‌ - విశాఖపట్నం రైలు... 07148 నెంబర్‌ à°—à°² రైలు జనవరి 10, 12 తేదీలలో సాయంత్రం 5.45కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07147 నెంబర్‌తో జనవరి 11, 13 తేదీలలో సాయంత్రం 6.50కు బయలుదేరి మరుసటి రోజు 9.45కు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.