‘విశాఖ’ స్ఫూర్తితో పోరాటం

Published: Tuesday June 26, 2018
‘à°•à°¡à°ª ఉక్కు... ఆంధ్రుల హక్కు’ అని నినదించాలని సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది దేశమంతా ప్రతిధ్వనించేలా ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కడపలో టీడీపీ నేతలు ఆమరణ దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో 1960లలో తెలుగువారు చేసిన పోరాటం దేశం అంతా ప్రతిధ్వనించింది. à°† పోరాట తీవ్రతకు కేంద్రం దిగి వచ్చి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా పోరాడి à°•à°¡à°ª ఉక్కును సాధించుకోవాలి. à°ˆ పోరాటానికి ఐదు కోట్ల మంది ఆంధ్రులు సంఘీభావం ప్రకటించాలి’’ అని చంద్రబాబు కోరారు. కడపలో టీడీపీ నేతలు సీఎం రమేశ్‌, బీటెక్‌ రవి చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మంగళవారం అన్ని జిల్లాల్లో మోటార్‌ సైకిల్‌ ర్యాలీలు చేయాలని, బుధవారం ధర్నా, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. 28à°µ తేదీ గురువారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలంతా కలిసి ధర్నా చేయాలన్నారు.