. డ్రైవర్, ట్రైనర్‌కు రూ.3.95 కోట్ల విలువైన షేర్ల గిఫ్ట్!

Published: Tuesday February 22, 2022

 à°à°¡à±€à°Žà°«à±‌సీ ఫస్ట్‌బ్యాంక్ à°Žà°‚à°¡à±€, సీఈవో వి.వైద్యనాథన్ పెద్ద మనసు చాటుకున్నారు. రూ. 3.95 కోట్ల విలువైన తన 9 లక్షల షేర్లను ఐదుగురికి గిఫ్ట్‌à°—à°¾ ఇచ్చేశారు. వీరిలో ఆయన ట్రైనర్, ఇంటి సహాయకుడు, డ్రైవర్ కూడా ఉన్నారు. వారు సొంతంగా ఇళ్లు కొనుక్కునేందుకు సాయం చేయడంలో భాగంగా ఆయనీ షేర్లను బహుమతిగా ఇచ్చేశారు.

 

వీరితో ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి బంధుత్వం లేకపోవడం గమనార్హం. గతంలోనూ ఇలానే ఆయన తనకు సంబంధంలేని వ్యక్తులకు షేర్లను బహుమతిగా పంచిపెట్టి దాతృత్వాన్ని చాటుకున్నారు. బ్యాంకు à°Žà°‚à°¡à±€ వైద్యనాథన్ తన 9 లక్షల షేర్లను à°ˆ నెల 21 గిఫ్ట్‌à°—à°¾ ఇచ్చేసినట్టు సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంకు తెలిపింది.

 

వైద్యనాథన్ తన 9 లక్షల షేర్లలో 3 లక్షల షేర్లను ట్రైనర్ రమేశ్ రాజుకు, ఇంటి సహాయకుడు ప్రంజల్ నర్వేకార్, డ్రైవర్ అల్గర్‌సామి సి మునపర్‌కు చెరో 2 లక్షల షేర్లు, ఆయన కార్యాలయ సపోర్ట్ స్టాఫ్ అయిన దీపక్ పతారే, సహాయకుడు సంతోష్ జొగాలేకు  చెరో లక్ష షేర్లను బహుతిగా ఇచ్చేశారు.

 

బీఎస్‌à°ˆ‌లో ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఒక్కో షేర్ ధర నిన్న (సోమవారం) రూ.43.90 వద్ద క్లోజ్ అయింది. à°ˆ లెక్కన చూసుకుంటే వైద్యనాథన్ బహుమతిగా ఇచ్చేసిన షేర్ల విలువ 3.95.10,00 రూపాయలు. సామాజిక సేవా కార్యక్రమాలకు గాను 2 లక్షల ఈక్విటీ షేర్లను రుక్మణి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు ఇచ్చినట్టు ఐడీఎఫ్‌సీ బ్యాంకు పేర్కొంది. అంటే మొత్తంగా 11 లక్షల షేర్లను గిఫ్ట్‌à°—à°¾ ఇచ్చినట్టు అయింది.