దౌత్యపరమైన పరిష్కారానికి సిద్ధమే, కానీ..

Published: Wednesday February 23, 2022

ఉక్రెయిన్ సంక్షోభాన్ని దౌత్యపరంగా పరిష్కరించుకోవడానికి సిద్ధమేనని, అయితే తమ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ చెప్పారు. ‘డిఫెండర్ ఆఫ్ ది ఫాదర్‌లాండ్ డే’ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో à°ˆ వ్యాఖ్యలు చేశారు. రష్యా-పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపత్యంలో సైన్యాన్ని పుతిన్ ప్రశంసించారు.

 

‘‘అత్యంత సంక్లిష్ట సమస్యలకు దౌత్యపరమైన పరిష్కారాలను అన్వేషించేందుకు ప్రత్యక్ష, నిజాయితీతో కూడిన చర్చకు మా దేశం ఎల్లప్పుడు సిద్ధమే’’నని పుతిన్ à°ˆ వీడియోలో చెప్పారు. ‘‘(కానీ) రష్యా ప్రయోజనాలు, మా ప్రజల భద్రత మాకు చర్చనీయాంశాలు కాదు’’ అని వివరించారు. 

 

తూర్పు ఉక్రెయిన్‌లని డోనెట్‌స్క్, లుహాన్‌స్క్‌à°² స్వతంత్రతకు సోమవారం రష్యా గుర్తింపునిచ్చింది. డోనెట్‌స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్‌స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌à°² స్వతంత్రత, సార్వభౌమాధికారాలను తక్షణమే గుర్తించడం అవసరమని తాను భావిస్తున్నానని, ఇది చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశమని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ చరిత్రను వివరిస్తూ, ఇది ఎల్లప్పుడూ రష్యాలో భాగంగానే ఉండేదన్నారు. రష్యా సైన్యాన్ని అభినందించారు, సైన్యం వృత్తి నైపుణ్యం పట్ల తనకు గట్టి నమ్మకం ఉన్నట్లు తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం సైన్యం దృఢంగా నిలుస్తుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. సైన్యం యుద్ధ సన్నద్ధతను ప్రశంసించారు. దీంతో అంతర్జాతీయంగా ప్రశ్నలు మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో సైనిక సంఘర్షణకు ఇది à°“ ముందడుగు అని పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

 

మరోవైపు దేశం వెలుపల సైనిక శక్తిని వినియోగించేందుకు పుతిన్‌కు రష్యా ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా అనుమతి ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, నాటో హెచ్చరించినప్పటికీ రష్యాలో à°ˆ పరిణామాలు జరుగుతున్నాయి. 

 

ఇదిలావుండగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం రష్యాపై తొలి విడత ఆంక్షలను ప్రకటించారు. రష్యా సావరిన్ డెట్‌పై ఆంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పాశ్యాత్య దేశాల ఫైనాన్సింగ్ నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు చెప్పారు. దురాక్రమణకు తెగబడితే మరిన్ని à°•à° à°¿à°¨ ఆంక్షలను విధిస్తామన్నారు. యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.