ఉక్రెయిన్‌పై రష్యా రెండో రోజూ భీకర యుద్ధం..

Published: Friday February 25, 2022

ఉక్రెయిన్‌పై రెండో రోజూ రష్యా భీకర యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్ సహా ప్రధాన నగరాలపై  గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. భూ, ఆకాశ, సముద్ర మార్గాల్లో à°ˆ దాడులు జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపులో ఏర్పడిన భారీ సంక్షోభాల్లో ఇదొకటి. నిన్నటి నుంచీ రష్యా భీకర యుద్ధంతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. యుద్ధం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఛాలెంజ్ చేసి మరీ చెబుతుండగా.. ఉక్రెయిన్‌ను à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ వదిలేశారని.. ప్రపంచం పట్టించుకోవట్లేదని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. రష్యా జరుపుతున్న దాడుల్లో జరుగుతున్న విద్వంసాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూసిన ప్రపంచం తల్లడిల్లిపోతోంది. ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయమనం పాటించాలని రష్యాను కోరుతున్నారు. కీవ్‌లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ రష్యాలోని సుమారు 51 నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించిన దాదాపు 1,700 మంది రష్యన్లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం సెంట్రల్ కీవ్‌లో రెండు భారీ పేలుళ్ళు వినిపించాయి. రష్యన్ సేనలు కీవ్‌ను సమీపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ సైన్యం ఫేస్‌బుక్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం, కీవ్‌లో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యా దాడులు చేస్తోంది. రష్యాకు రెండు భయానక బహుమతులను ఇచ్చామని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తెలిపింది.