ఎన్ని ఆంక్షలు విధించినా అభిమానం ముందు అన్నీ కొట్టుకుపోతాయ

Published: Saturday February 26, 2022

భీమ్లానాయక్‌.. సినిమాపై ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా అభిమానం ముందు అన్నీ కొట్టుకుపోతాయని పవన్‌ అభిమానులు నిరూపించారు. థియేటర్ల వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించినా సంయమనం కోల్పోకుండా తమ అభిమాన నటుడి చిత్రాన్ని వీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొదటిరోజు భీమ్లానాయక్‌ 140 థియేటర్లలో విడు దల కాగా అన్ని థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే పోలీ సులు ఆంక్షలు కఠినతరం చేశారు. లోపలికి వెళ్లాలంటే టిక్కెట్‌ ఉండాలి. లేకపోతే ద్విచక్ర వాహనాలకు చలానాలు విధించారు. లాఠీలతోనూ అక్కడక్కడా విరుచుకుపడ్డారు. ఎక్కడా హడావుడి లేకుండా చేయాలనుకున్న పోలీసులు ఇటువైపు, ఉత్సాహంగా సినిమా చూసేందుకొచ్చిన అభిమానులు మరోవైపు.. ఇదంతా చూసేవారికి చిత్రంగా కనిపించింది.

ఎక్కడిక్కడ ప్రీమియర్‌ షోలు రద్దుచేసినా ఎక్కడా అభిమానులు తొందరపడలేదు. సిని మాకు వచ్చే ఆదాయంపై à°—à°‚à°¡à°¿ కొట్టాలనే ఉద్దేశంతో జీవో నెం బరు 35 ప్రకారమే రెవెన్యూ అధికారులు దగ్గరుండి టిక్కెట్లు అమ్మకాలు చేయడం విశేషం.

 

రెవెన్యూ, పోలీసుల చేతుల్లోకి టిక్కెట్లు వెళ్లిపోవడంతో థియేటర్‌ యాజమాన్యం చేతిలో కాకుండా అధికారుల చేతుల మీదుగా బ్లాక్‌ దందా నడిచింది. చాలామంది తెలిసిన పోలీసులను, రెవెన్యూ అధికారులను à°…à°¡à°¿à°—à°¿ టిక్కెట్టు సంపాదించుకున్న వైనం ఆశ్చర్యం కలిగింది.  మొత్తానికి భీమ్లానాయక్‌ సినిమాపై రెండ్రోజుల నుంచి అధి కారుల హడావుడి అభిమానుల కోలాహలంలో కొట్టుకుపో యింది. పోలీసులు à°Žà°‚à°¤ అత్యుత్సాహం ప్రదర్శించినా అభిమా నులు థియేటర్ల వద్ద బాణాసంచా పేల్చి పవన్‌ కటౌట్‌లకు పాలాభిషేకాలు చేశారు. బ్యానర్లతో ఊరేగింపులు చేశారు.