అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు

Published: Tuesday March 01, 2022

జిల్లాలోని కంచికచర్ల చెరువుకట్ట దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది వున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.