రేణూ దేశాయ్ నిశ్చితార్ధంపై పవన్ స్పందన

Published: Tuesday June 26, 2018

రేణు తాను పెళ్లాడబోయే వరుడితో ఉంగరాలు మార్చుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుని, నిశ్చితార్థం జరిగిందని తెలిపారు. తనకు కాబోయే భర్తకు ధన్యవాదాలు చెప్పారు. బాధ నుంచి కోలుకునేందుకు నాకు సహాయంగా నిలిచినందుకు నీ మనసుకు ధన్యవాదాలు అని రేణు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు. ఇక రేణు పెళ్లి చేసుకుంటానన్న మాటకు ఇది వరకూ పవన్ అభిమానులు వ్యతిరేకంగా ట్రోల్ చేశారు.

à°† కారణంగానే రేణు కాస్త ఎమషనల్‌గానే ట్వీట్ చేసింది. పెళ్లి అనేది వ్యక్తిగత విషయానికి సంబంధించింది..à°† విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవొద్దని షాక్ ఇచ్చింది. మగవాళ్లతో సమానంగా ఆడవారికి హక్కులు ఉంటాయని చెప్పడమే తన ఉద్ధేశమని రేణు చేసిన వ్యాఖ్యను బట్టి .. తన లైఫ్‌లో తోడు గురించి తాను à°Žà°‚à°¤ తపించిందో చెప్పకనే చెప్పింది.

తన నిర్ణయానికి అమ్మాయిల కంటే అబ్బాయిలే మద్ధతుగా నిలిచారని రేణు పేర్కొన్నారు. అయితే, రేణు దేశాయ్ రెండో వివాహంపై ఆమె మాజీ భర్త, నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. రేణు రెండో పెళ్లికి మద్దతు ప్రకటించారు.à°ˆ మేరకు ఇవాళ ట్వీట్టర్‌ ద్వారా స్పందించిన పవన్.. ''కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న రేణు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. అంతా మంచే జరగాలని à°† దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రకృతి తనకు సమృద్ధియైన ఆయురారోగ్యాలు, ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు. కాగా, పవన్ స్పందనపై ఇరువురి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.