యుద్ధం సాకుతో ధరలు పడిపోయి విలవిల

Published: Thursday March 10, 2022

యుద్ధం సాకుతో ధరలు పడిపోయి విలవిలలాడుతున్నారు. సీమ జిల్లాల్లోని రైతుల పరిస్థితి ఇది. à°—à°¤ నెలలో పసుపు క్వింటా రూ.7 వేలకు పైగా పలికింది. ఇప్పుడిప్పుడే పంట మార్కెట్‌కు చేరుతోంది. అధిక వర్షాలకు పంట తడిసి నాణ్యత లేకపోవడం à°“ కారణమైతే.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోవడం కూడా ధరలు పతనమవ్వడానికి మరో కారణమంటూ వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారు. రాయలసీమ అంతటికీ కలిపి కడపలో ఉన్న ఏకైక పసుపు మార్కెట్‌లో బుధవారం క్వింటా కనిష్ఠంగా రూ.3,115 ఉంటే.. గరిష్టంగా రూ.6,932 పలికింది. సగటు (మోడల్‌) ధర రూ.6 వేలలోపే. à°—à°¤ నవంబరులో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతిని దిగుబడి సగానికిపైగా తగ్గింది. మిగిలిన అరకొర పంటను మార్కెట్‌కు తెస్తే.. గిట్టుబాటు ధర లేక పసుపు రైతులు కన్నీరు పెడుతున్నారు.

 

రాయలసీమలోని à°•à°¡à°ª, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో మొత్తం 5,500 హెక్టార్లకు పైగా సాగు చేస్తే.. ఒక్క à°•à°¡à°ª జిల్లాలో ఖరీ్‌à°«-2021లో 3,500 హెక్టార్లలో సాగు చేశారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తకుండా కాలం కలిసొస్తే హెక్టారుకు సగటున 7 మెట్రిక్‌ టన్నుల (ఎకరాకు 28-30 క్వింటాళ్లు) దిగుబడి వస్తుంది. à°•à°¡à°ª, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, రాజంపేట, రైల్వేకోడూరు వంటి ప్రాంతాల్లో పసుపు అధికంగా సాగు చేస్తున్నారు.

 

ఒంటిమిట్ట మండలం మఠంపల్లె గ్రామానికి చెందిన ప్రసాద్‌రెడ్డి అనే రైతు మూడు ఎకరాల్లో పసుపు సాగు చేశారు. ఎకరాకు రూ.1.50 లక్షల చొప్పున ఖర్చు చేశాడు. వంద బస్తాలు దిగుబడి వచ్చింది. à°—à°¤ శుక్రవారం (4à°µ తేది) 50 బస్తాలు à°•à°¡à°ª మార్కెట్‌కు అమ్మకానికి తెచ్చాడు. క్వింటా రూ.6,490 ధర పలికింది. మరో 50 బస్తాలు మంగళవారం మార్కెట్‌కు తెస్తే, క్వింటా రూ.6,080లకు వ్యాపారి టెండరు వేశారు. చేసేది లేక à°† ధరకే అమ్మేశాడు. నాలుగు రోజుల్లో రూ.410 పతనమై దాదాపు రూ.15 వేలు నష్టపోయాడు. ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటా రూ.10 వేలకు కొనుగోలు చేయాలని ప్రసాద్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. ప్రసాద్‌రెడ్డిదే కాదు.. ప్రతి రైతుదీ ఇదే పరిస్థితి. à°—à°¤ ఏడాది ఇదే సమయంలో క్వింటా రూ.7,500 నుంచి రూ.8 వేల వరకు పలికింది. మంగళవారం à°•à°¡à°ª మార్కెట్‌ రేట్లు పరిశీలిస్తే.. కొమ్ములు కనిష్టంగా రూ.3,115లు, గరిష్టంగా రూ.6,932 పలికితే.. మోడల్‌ ప్రైజ్‌ రూ.6,080 ఉంది. ఉండలు కనిష్ఠంగా రూ.5,316లు, గరిష్ఠంగా రూ.6,115 పలికితే.. సగటు (మోడల్‌) ధర రూ.5,890 పలికింది. కొమ్ములు, ఉండలు అధికంగా రూ.5,500లకు మించి వ్యాపారులు కొనుగోలు చేయలేదని రైతులు చెబుతున్నారు. అంటే.. వారం పది రోజుల్లోనే క్వింటాపై సరాసరి రూ.వెయ్యి నుంచి రూ.1,500లకు పైగా పతనమైందని వాపోతున్నారు.

 

పసుపు ధరలు పతనమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర నిర్ణయించి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తుంది. 2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం క్వింటాకు రూ.6,500 మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక 2020లో ఫిబ్రవరి నెలలోనే రూ.6,850లు నిర్ణయించి జీవో ఆర్టీ నం.157 జారీ చేసింది. తరువాత కొన్ని సవరణలతో మార్చి 31à°¨ మరో జీఓను జారీ చేసి ఏప్రిల్‌లో కొనుగోళ్లు చేపట్టారు. à°ˆ పరిస్థితుల్లో పసుపు రైతులను ఆదుకోవాలంటే రూ.8,500 నుంచి రూ.10 వేలు మద్దతు ధర నిర్ణయించి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 

ఎకరన్నర పొలంలో పసుపు సాగు చేశా. ఎకరాకు రూ.1.25 లక్షలకు పైగా పెట్టుబడి వచ్చింది.  నాణ్యత లేదని క్వింటా రూ.3,110లకు కొనుగోలు చేశారు. నా చేతికి రూ.30 వేలు కూడా రాలేదు. పెట్టుబడి రూ.లక్ష అప్పే మిగిలింది. ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఎకరాకు రూ.6 వేలు ఇస్తామన్నా.. ఇప్పటికీ నాకు రాలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.