బోయిగూడ ప్రమాదంపై బాధితుడు ప్రేమ్‌కుమార్‌ కీలక సాక్ష్యం

Published: Wednesday March 23, 2022

బోయిగూడ ప్రమాదంపై బాధితుడు ప్రేమ్‌కుమార్‌ కీలక సాక్ష్యం చెప్పాడు. ప్రమాదంలో బయటపడిన ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు విచారించారు. à°ˆ ఘోర ప్రమాదంపై ప్రేమ్‌కుమార్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. స్క్రాప్‌ గోడౌన్‌ యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపాడు. తాను రెండేళ్లుగా గోదాంలోనే పనిచేస్తున్నానని, తనతో పాటు 11 మంది గోదాం మొదటి ఫ్లోర్లో నిద్రపోయామని చెప్పాడు. చిన్న రూమ్‌లో తనతోపాటు బిట్టు, పంకజ్‌ ఉన్నారని, మరో రూమ్‌లో మిగతా 9 మంది కార్మికులు పడుకున్నారని ప్రేమ్‌కుమార్‌ వెల్లడించాడు. రాత్రి 3 à°—à°‚à°Ÿà°² సమయంలో పొగలతో మంటలు వచ్చాయని, బయటకు వెళ్లేందుకు ప్రయత్నించామని, కానీ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని తెలిపాడు. తాను కిటికీలోంచి బయటకు దూకానని ప్రేమ్‌కుమార్‌ చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారని తెలిపాడు. అప్పటికే వాళ్లంత చనిపోయారని వెల్లడించాడు. ప్రేమ్‌కుమార్ ఫిర్యాదుతో బోయిగూడా అగ్నిప్రమాదంలో స్క్రాప్  యజమాని సంపత్‌పై కేసు నమోదు చేశారు. సంపత్‌పై 304ఏ, 337 à°•à°¿à°‚à°¦ పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

బోయిగూడలోని à°“ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‎తో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున 3 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో గోదాంలో మంటలు చెలరేగాయి. à°ˆ ఘోర అగ్ని ప్రమాదంలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాదం నుంచి à°’à°• కార్మికుడు మాత్రమే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు గోదాంలో మొత్తం 12 మంది కార్మికులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ 11 మంది కార్మికుల మృతదేహాలను బయటికి తీశారు. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా అధికారులు చెబుతున్నారు. మృతులు బిట్టు, సికిందర్‌, దినేష్‌, దామోదర్, చింటు, సికిందర్‌, రాజేష్‌, రాజు, దీపక్‌, సత్యేందర్, పంకజ్‌à°—à°¾ గుర్తించారు.