‘ఫ్లోరైడ్‌’... బోర్లు బంద్‌

Published: Thursday June 28, 2018
గ్రామాల్లో తాగునీటికి ఉపయోగిస్తున్న చేతి పంపుల నీటిని పరీక్షించి ఫ్లోరైడ్‌ ఆనవాలు ఉంటే వాటిని వెంటనే మూసేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో అడుగంటిన మంచినీటి బోరుబావులను వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టం ద్వారా రీచార్జ్‌ చేయాలని సూచించారు. ‘గ్రామాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. అవసరమైన మేజర్‌ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. రోడ్డు మట్టానికి 3 అంగుళాల ఎత్తు వరకూ డ్రైనేజీ అంచులను నిర్మించి పై కప్పు వేయాలి.
 
తద్వారా అనవసర వ్యర్థాలు డ్రైనేజీలోకి వెళ్లకుండా.. అవి పొంగకుండా నివారించవచ్చు. మొత్తం మేజర్‌ పంచాయతీల్లో దాదాపు 12 వేల à°•à°¿.మీ మేర భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ సమర్థంగా జరగాలి. పెద్దఎత్తున వర్మికంపోస్ట్‌ యూనిట్లు నెలకొల్పాలి. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నవంబరుకల్లా ప్రతి గ్రామం ఓడీఎఫ్‌ ప్లస్‌కు వెళ్లాలి’ అని స్పష్టం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్రం నిర్ణయించిన ఆరు విభాగాల్లో నాలుగు విభాగాల్లో మొదటి స్థానంలోను, à°’à°• దానిలో రెండో స్థానంలోనూ నిలిచి దేశంలో అగ్రస్థానంలో నిలిచామని మంత్రి లోకేశ్‌ ముఖ్యమంత్రికి తెలిపారు.
 
 à°ˆ సంవత్సరం రూ.2099 కోట్లు వేతనాల రూపంలో చెల్లించామని, పెండింగ్‌ లేకుండా సమయానికి చెల్లించామని, à°ˆ సంవత్సరం మెటీరియల్‌ కాంపోనెంట్‌ à°•à°¿à°‚à°¦ రూ.550 కోట్లు ఖర్చు చేసి సగటున రూ.200 వేతనం చెల్లిస్తున్నామని వివరించారు. 11 వేల పంచాయతీల్లో 2 కోట్ల పనిదినాల కల్పన లక్ష్యాన్ని చేరుకున్నట్లు చెప్పారు.