ప్రాంతీయతను రెచ్చగొడుతున్నానా? ప్రశ్నిస్తే.. విద్వేషాలేనా ???

Published: Tuesday July 03, 2018


శృంగవరపుకోట : ‘‘వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్రను విస్మరించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. పట్టిసీమను నిర్మించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉంటాయి. కానీ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు మాత్రం డబ్బులుండవు. దీనిపై ముఖ్యమంత్రి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా సోమవారం ఆయన విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో పర్యటించారు. దేవీబొమ్మ కూడలిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు. విభజన చట్టంలో ఉన్న రైల్వే జోన్‌ను సాధించలేని అధికార పార్టీ, కనీసం విజయనగరం జిల్లా కొత్తవలసలో రైల్వే అండర్‌ బ్రిడ్జిని కూడా తేలేకపోయిందని విమర్శించారు.à°ˆ బ్రిడ్జి కోసం స్థానికులు నిరాహార దీక్షలు చేపట్టాల్సిన పరిస్థితి రావడం దారుణమన్నారు. ‘‘శృంగవరపుకోట మండలంలో జిందాల్‌కు మూడువేల ఎకరాలకు పైబడి, కొత్తవలస మండలంలో ‘పతంజలి’à°•à°¿ 200 ఎకరాల వరకూ భూములు కట్టబెట్టారు. à°† భూముల్లో ఎటువంటి పరిశ్రమలూ ఏర్పాటు కాలేదు. విశాఖపట్టణం జిల్లా మధురవాడలో సీఎం దగ్గర బంధువుకు à°Žà°•à°°à°¾ రూ.35లక్షలకు ఇచ్చారు. à°ˆ ప్రాంతంలోనే ఉత్తరాంధ్ర పారిశ్రామిక వేత్తల నుంచి మాత్రం ఎకరాకు రూ. 3కోట్లు తీసుకున్నారు. ఇలాంటివన్నీ మాట్లాడితే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నానని అంటున్నారు. ఇది సబబేనా’’ అని పవన్‌ ప్రశ్నించారు.ప్రత్యేక హోదా వస్తేనే ఇలాంటి అసమానతలు పోతాయన్న ఆయన, హోదా కోసం మొదటి నుంచీ జనసేన మాత్రమే కట్టుబడి ఉందన్నారు. ‘మీ ఒక్కొక్క ఓటుతో జనసేనకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడితే ఐదేళ్లపాటు సుపరిపాలన అందిస్తాను. అన్నిరకాల దోపడీ వ్యవస్థలను అరికడతాను. మేం రాగానే, జిందాల్‌ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తాం. కుదరకపోతే ప్రత్యామ్నాయంగా భూములను కొనుగోలు చేసి ఇస్తాం’ అని హామీ ఇచ్చారు.