మచిలీపట్నం తీర ప్రాంతంలో బోటు మునక

Published: Friday July 13, 2018
 à°µà±‡à°Ÿà°•à± వెళ్లి గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌కు తిరిగి వస్తున్న బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు బోటు యజమాని మోకా నరసింహస్వామి గురువారం ‘ఆంధ్రజ్యోతి’à°•à°¿ తెలిపారు. గిలకలదిండికి చెందిన మోకా నరసింహ స్వామి వారం రోజుల క్రితం ఎనిమిది మంది జాలర్లతో సముద్రపు వేటకు వెళ్లాడు. దాదాపు మూడు లక్షల విలువైన చేపలను పట్టి తిరిగి వస్తుండగా à°ˆ ప్రమాదం జరిగింది.
 
ప్రమాదాన్ని తెలుసుకున్న వెంటనే జాలర్లు హుటాహుటిన ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మూడు లక్షల విలువైన చేపలు పడ్డాయన్న ఉత్సాహంతో తిరిగి వస్తున్న జాలర్లు సరుకులు పోగొట్టుకుని ప్రాణాలతో బయట పడ్డారు. à°ˆ వేటలో డ్రైవర్‌ నారాయణ, భాస్కరరావు, బుల్లయ్య, వేణు, రాజు, గోపాలరావు తదితరులు ఉన్నారు. à°ˆ బోటు ధ్వంసం కావడంతో ఏడుగురు జీవనోపాధి కోల్పోయారు.