కొడుకు, కోడలు దాష్టీకం

Published: Friday July 13, 2018

వృద్ధాప్యంలో à°…à°‚à°¡à°—à°¾ ఉండాల్సిన కన్నకొడుకే తల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు. కోడలూ భర్తకు సహకరించింది. దయనీయ స్థితిలో ఉన్న à°† వృద్ధురాలిని కొందరు యువకులు పోలీసుస్టేషనుకు చేర్చారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దాచేపల్లి సీతారావమ్మ గురువారం గుంటూరు పట్టాభిపురం పరిసరాల్లో రోడ్డుపై గాయాలతో పడి ఉండగా గుర్తించిన స్థానికులు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం ఆమెను జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తనకు ఆంజనేయులు అనే కుమారుడు, సునీత అనే కోడలు ఉన్నారని సీతారావమ్మ తెలిపింది. తన ఆస్తిని లాక్కున్న కొడుకు, కోడలు తనను ఇంటి నుంచి పొమ్మంటున్నారనీ, బయటకు వెళ్లి బతికే శక్తిలేదని బతిమిలాడినా పట్టించుకోలేదని వాపోయింది. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలివేశారని, అంతకు మించి ఏమీ గుర్తులేదని చెప్పింది.