పడవ ప్రమాదంపై మంత్రి గంటా స్పందన

Published: Sunday July 15, 2018
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద ప్రయాణికులతో నిండిన ఇంజన్‌ పడవ నిన్న (శనివారం) గోదావరిలో బోల్తా పడిన ఘటనపై మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు స్పందించారు. పడవ ప్రమాదం చాలా బాధాకరమని అన్నారు. సిలబస్ అవ్వకపోవడం వల్లే శని, ఆదివారాల్లో పాఠశాలలు నడిపామని వివరించారు. గోదావరిలో వరద ఉధృతి వల్లే పడవ ప్రమాదం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
 
కాగా పడవ ప్రమాద ఘటనలో ఇంకా ఏడుగురు ఆచూకీ లభించాల్సి ఉంది. ఒక బృందం పసువుల్లంక నుంచి ఎగువకు యానం వైపు గాలింపు చర్యటు చేపట్టింది. గాలింపు చర్యలు చురుగ్గా సాగుతున్నాయని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. మరో బృందం యానం నుంచి పసువుల్లంక వైపు గాలింపు చర్యలు చేపట్టింది. 9 బోట్లు, గజ ఈతగాళ్లతో, రెస్క్యూ పరికరాలతో గాలింపు కొనసాగుతోంది.