బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌లో పెదగంట్యాడ యువకుడి ఆత్మహత్య

Published: Friday July 20, 2018
తెలంగాణలోని యాదాద్రి జిల్లా బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద విశాఖపట్నానికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని రాఘవేంద్ర ఫంక్షన్‌ హాలు ఎదుట 227/5-7 కిలోమీటర్‌ మైలురాయి వద్ద ఎగువ ట్రాక్‌పై విశాఖపట్నంలోని పెదగంట్యాడ సమీపం నెలిముకు ప్రాంతంలోని ఆర్‌హెచ్‌ కాలనీకి చెందిన వాసిరెడ్డి శ్రీను (21) రైలు à°•à°¿à°‚à°¦ పడి మృతి చెందాడు. అతడి మృతదేహం ఛాతీ, పొట్ట భాగంగా రెండు ముక్కలుగా తెగి పడి ఉంది. ఘటనాస్థలంలో మృతదేహం పడి ఉన్న తీరును బట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుడి జేబులో లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా ఆచూకీ కనుగొని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియదని రైల్వే పోలీసులు తెలిపారు. కేసును రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ కాంతారావు దర్యాప్తు చేస్తున్నారు.
 
 
ఇంటర్వ్యూ ఉందంటూ వెళ్లాడు..
తాను à°“ మంచి కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతున్నానని శ్రీను ఇంట్లో చెప్పి బయలుదేరాడు. à°ˆ నెల 16à°¨ ఇంటర్వ్యూ ఉందని తెలిపాడు. అనంతరం బుధవారం రాత్రి ఇంటికి ఫోన్‌ చేసి తన ఇంటర్వ్యూ సంతృప్తికరంగా సాగిందని, ఉద్యోగం వస్తుందని వస్తుందని తల్లిదండ్రులకు తెలిపాడు. అంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చిందని మృతుడి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.