టీడీపీ అవిశ్వాసానికి పలు పార్టీల మద్దతు

Published: Saturday July 21, 2018
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని చాటుతూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు సౌగత్‌ రాయ్‌, దినేశ్‌ త్రివేది, సీపీఎం నేత మహ్మద్‌ సలీంతో పాటు పలు పార్టీల నేతలు బరిపరిచారు. టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్‌ ప్రసంగం విన్నాక రాష్ట్ర ప్రజల సమస్యలపై ఆయన ప్రగాఢ ఆవేదన తనకు తెలిసిందని.. అన్యా యం జరిగిన వారిలో ఆయనొక్కరే లేరని, à°ˆ దేశంలో ఆయనలాంటి బాధితులెందరో ఉన్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో అన్నారు.
 
‘21à°µ శతాబ్దపు రాజకీయ ఆయుధానికి ఏపీ బలైంది. మాయమాటలు చెప్పి మోసగించడమే à°ˆ ఆయుధం. మనకు ఎలాంటి ప్రధానమంత్రి ఉన్నారో దీన్ని బట్టి అర్థమైంది. గల్లా ప్రసంగంలో ప్రతి ఒక్క పదాన్ని శ్రద్ధగా విన్నాను’ అని చెప్పారు. బీజేపీ, మోదీ ‘విభజించు-పాలించు’ సిద్ధాంతాన్ని పాటిస్తున్నందునే ఏపీకి అన్యాయం జరిగిందని ఖర్గే అన్నా రు. ఆంధ్రకు కేంద్రం అన్యాయం చేసిందన్న విషయంలో తాము ఏకీభవిస్తున్నామని, తమ నేత మమతా బెనర్జీ టీడీపీకి పూర్తి మద్దతు ఇస్తున్నారని టీఎంసీ ఎంపీ దినేశ్‌ త్రివేది చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు అకాలీదళ్‌ మద్దతిస్తోందని à°† పార్టీ సీనియర్‌ నేత చందుమజ్రా స్పష్టం చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించి విప్‌ కూడా జారీచేసింది. సభలో ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ ఆంధ్రకు అనుకూలంగా మాట్లాడారు.