కోడె పందాలు ఊన్నాయా ? లెదా?

Published: Saturday January 06, 2018

భీమవరం  : కోడిపందేలు ఆపాల్సిందే’’నన్న హైకోర్టు తీర్పుతో, సంక్రాంతి ‘బరి’పై సందిగ్ధత నెలకొంది. ఈసారి కచ్చితంగా కోడిపందేలు లేనట్టేనని కొందరు అనుకుంటుంటే , పండగ దగ్గర పడేసరికి తమకు వాతావరణం అనుకూలిస్తుంది అని మరికొందరు ధీమాతో ఉన్నారు. ప్రతి సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లాలో 450 బరులు ఏర్పాటవుతాయి. సంక్రాంతి మూడు రోజులూ కోట్ల రూపాయల విలువైన పందేలు కడతారు. నిజానికి, ఈసారి పెద్దఎత్తున పందేం ఆడేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. à°—à°¤ ఏడాది పెద్ద నోట్ల రద్దు కారణంగా అంతగా కోడి పందెం సాగలేదన్న అభిప్రాయం వారిలో ఉంది. దీంతో, పండగకు రెండు నెలల ముందునుంచే, à°ˆ జిల్లాలో పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేయడం మొదలయింది. నిర్వాహకులు జాతి పుంజులపై లక్షల రూపాయలు కర్చుపెట్టారు . భీమవరం, ఉండి, పాలకొల్లు, ఆకివీడు, కాళ్ల, వీరవాసరం, కొణితివాడ, ఆచంట, పెనుమంట్ర, నర్సాపురం, మొగల్తూరు, యలమంచిలి, కలగంపూడి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, గణపవరం, ఉంగుటూరు ప్రాంతా ల్లో పందేం కోళ్లకు ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నారు. హైకోర్టు తీర్పు ప్రభావం à°ˆ ప్రాంతాల్లో కనిపిస్తోంది. సంప్రదాయ పందేలకు కోర్టు అడ్డు చెప్పబోదన్న ఆశతో చాలామంది నిర్వాహకులు ఉన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్టే తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలపై గంపెడు ఆశలు నిలుపుకొన్నారు.