విస్తారంగా వర్షాలు

Published: Sunday July 22, 2018
పశ్చిమబెంగాల్, à°’à°¡à°¿à°·à°¾ తీరాన్ని ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఒడిసా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఒడిషాలోని భువనేశ్వర్, పూరి, కడక్‌లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొత్తవలస, కిరండోల్, రాయగఢ ప్రధాన మార్గాల్లో పలుచోట్ల రైలు మార్గాలు పూర్తిగా జలమయం అయ్యాయి. భువనేశ్వర్ మీదుగా విశాఖ వచ్చే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
 
అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలిక పాటి నుంచి మొస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజుల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 15 సెం.మీ., సోంపేట, మందసలో 12, టెక్కలి, పాతపట్నంలో 11, ఇచ్చాపురంలో 10, అరకులో 9, చింతపల్లిలో 8, పాలకొండ, కళింగపట్నం, పాడేరులో 7, కురుపాం 5 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. వాయుగుండం కారణంగా కోస్తా తీరం వెంబడి సముద్రం గంటకు 45 కి.మీ. నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.