క్షీరాబ్దిలో శ్రీహరి శయనించే వేళ...

Published: Monday July 23, 2018

 

మానవ మనోవికాసం, సాత్విక చింతన, దానధర్మ కార్యాచరణ, సత్యనిష్ఠ జ్ఞానపిపాస, మోక్షాసక్తి తొలి ఏకాదశి తొలిసోపానం. హైందవ సంప్రదాయ సాంస్కృతిక జీవన విధానంలో ఏకాదశి అత్యంత పవిత్రమైన తిథి. హరినామ సంకీర్తనానికి ఈ పర్వదినం ప్రశస్తమైనది కావడంతో దీన్ని హరివాసరమన్నారు. ఆనందకరమైన ఆరోగ్యప్రాప్తికి, చిదానందకరమైన ఆధ్యాత్మిక దీప్తికీ తొలి ఏకాదశి

జ్ఞానసుధావారాశి. పూర్వం సంవత్సరంలో ఒక్కో రుతువ్ఞలో నాలుగు నెలలుండేవి. అవి వర్ష, హేమంత, వసంత రుతువ్ఞలు. అలాగే వర్షరుతువ్ఞ నుండి సంవత్సర ప్రారంభాన్ని పరిగణించడం వల్ల ఇది తొలి ఏకాదశిగా పేరొందింది. à°¦à±€à°¨à°¿à°•à±‡ శయనైకాదశి అని కూడా పేరు. ఈరోజు వైకుంఠంలో శ్రీమహావిష్ణువ్ఞ క్షీరాబ్దియందు శయనిస్తాడు. అందుకే ఇది శయనైకాదశిగా ప్రసిద్ధి చెందింది.

ఈరోజు విధిగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది. అయితే ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఇది తొలి ఏకాదశి అని అనడంలో అర్థం చాతుర్మాస్య వ్రతారంభమవ్ఞతున్నదని. చరాచరాత్మక నిర్మాత భగవానుడు సృష్టి కార్యాన్ని నిర్వర్తించి ఈ నాలుగు నెలలు క్షీరసాగరుడౌతాడు. అందుచేతనే రోగ బాధలు కూడా విజృంభిస్తాయి. భగవానుడు శయనించడం ఎప్పుడు మొదలైందో ఆయన నిద్రలేవడానికి ఒక ప్రత్యేక తిధి ఉంటుంది. అదే కార్తీక శుద్ధంలో వచ్చే ఏకాదశి. దీనిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు.

చాతుర్మాస్య వ్రతారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండే చాతుర్మాస్య వ్రతమారంభమవ్ఞతుంది. ఆనాడే తప్తముద్ర ధారణము-ధారణ పారణ వ్రతారంభం కూడ. ఈ ఏకాదశి నుండి శాకవ్రతం పాటిస్తారు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఏవిధమైన కాయగూరలు, ఆకుకూరలు భోజన పదార్థములుగా వాడరాదు.

ఏ పదార్థములు తిన్నా పప్పు పదార్థములతో వండినవే అయి ఉండాలి. చివరకు పోపు సామాన్లలో వాడే కరివేపాకు, కొత్తిమీర కూడా వాడరు. అంతేకాదు కారం కొరకు మిరియాలు, జీలకర్ర తప్ప తక్కిన సుగంధ ద్రవ్యాలను వాడరు. అంతేకాదు కారము కొరకు మిరియాలు, జీలకర్ర తప్ప తక్కిన సుగంధ ద్రవ్యాలను వాడరు. ఈ వ్రత కాలంలో ఉసిరిక వరుగు, మామిడి వరుగు, వేపపూత పచ్చళ్లుగా వాడుకోవాలి. ఈ విధమైన ఆహారనియమం మనస్సును స్థిరపరచటానికి, దైవధ్యానానికి, ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఏకాదశి నిరాహార వ్రతం, పక్షము రోజులకొక పర్యాయం నిరాహారంగా ఉండటం ఆరోగ్యప్రదం.

మరునాడు ద్వాదశి పారాయణ, à°ˆ ఏకాదశి వ్రతం ఇహపరసాధకం. కలియుగంలో ఇంతకంటే సులభతర ఉపాయం మరొకటి ఉండదు. à°ˆ వ్రతారంభంలో దేవతా గృహములో గృహస్థుడీవిధంగా భగవంతుని ప్రార్థిస్తాడు. చతురో వార్షికారమాసార, దేవస్యో త్థాపనావధి-ఇమం కరిష్యే నియమంI నిర్విఘ్నం కురుమేచ్యుతI ఇదం వ్రతం మయాదేవI గృహీతం పురతస్తవI నిర్విఘ్నం సిద్ధిమాయాతుII ప్రసాదాత్తవ కేశవII గృహీతేస్మిన్‌ వ్రతేదేవI పంచత్వం యదిమ్‌ భవేత్‌I తధాభవతు సంపూర్ణం-త్వత్ప్రసాదాత్‌ జనార్దనI శ్ర్రవణేవర్జుయేశ్శాకంI దధిభాద్రపదే తధాI దుగ్ధమాశ్వీయుజేమాని కార్తికేద్విదతం తధాII ఇమం కరిష్యే నియమంI నిర్విఘ్నం కురుమేచ్యుతII అని భగవంతుని ప్రార్థించి ఆయన అనుజ్ఞతో వ్రతమాచరించడం సంప్రదాయం. శ్రావణమాసంలో దీపం, పళ్లు ఆకులను వదులుతున్నాను.

భాద్రపదంలో పెరుగును ఆశ్వీయుజంలో పాలును, కార్తీకంలో ద్విదళ ధాన్యాన్ని (పెసలు మొదలైన గింజలు-రెండు బద్దలుగా వచ్చే గింజల) విసర్జిస్తున్నాను, ఈ వత్రాన్ని నిర్విఘ్నంగా ఆచరించేలా అనుగ్రహించు. ఒకవేళ వ్రత మధ్యంలో మరణం సంభవిస్తే సంపూర్ణ మయ్యేలా అనుగ్రహించమని ప్రార్థించి, స్వామికి శంఖంతో అర్ఘ్యమివ్వాలి.

చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించేవారు పాటించవలసిన నియమాలు ఆషాఢ పౌర్ణమి నుండి శ్రావణ పౌర్ణమి వరకు శాకవ్రతం, శ్రావణ పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు దధివ్రతం. భాద్రపద పౌర్ణమి నుండి ఆశ్వీయుజ పౌర్ణమి వరకు క్షీరం, ఆశ్వీయుజ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ద్విదళ వ్రతమును ఆచరించటం సంప్రదాయంగా వస్తున్నది.

ఇట్టి వ్రత విధానములు ఇహపర సాధనములు. దశేంద్రియములకు అతీతుడైన పరమాత్మనే ఏకాదశిగా భావించారు. ఉపవాసమనగా 'ఉపసమీపేవాసః-భగవంతుని సమీపంలో మనస్సును లగ్నపరచటమే ఈ వ్రత ప్రయోజనం. గృహస్థులు, ఇలా ప్రవర్తిస్తుండే సన్యాసాశ్రములు ఒకేచోట నిలిచి పర్యటనలు లేక దీక్షగా అనుష్ఠానములు చేస్తారు. అందువల్లనే పీఠాధిపతులు తక్కిన స్వాములవారలు చాతుర్మాస దీక్షలో ఉండటం (ప్రయాణాలకు అవరోధము కావచ్చు) శిష్య ప్రభోదానికి జపానుష్టానాలకు ఈ కాలం అతి ముఖ్యమైనది. ఈకాలంలో గృహస్థులు, సన్యాసులు కూడా రెండు నెలల తర్వాత స్థానచలనం చేయడం దేశకాలపరిస్థితుల బట్టే! కాని నాలుగు నెలలు కదలకుండ ఒకేచోట ఉండటం ఆచారం.
ఈ ఆషాఢమాసంలోనూ, శ్రావణమాసంలోనూ దధివ్రతాన్ని పాటిస్తారు. పాడిపశువ్ఞలు కొత్తగా ఈని పాలివ్వడంతో అప్పటి పెరుగు తినడం అనారోగ్యమని భావించారు. శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ శుక్రవారం నోములు, మౌంజీ విసర్జనం, హయగ్రీవ జయంతి, రక్షాబంధన, కృష్ణాష్టములు పండుగలు వస్తాయి.

మహభక్ష్య ప్రత్యామ్నాయముగా వాడతారు. ఈవిధంగా ఆశ్వీయుజం గడిచిపోయిన తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి వ్రతము ముగిసిన పిమ్మట ద్వాదశి నాడు స్వామికి కూడా సర్వ పదార్థ నివేదనముతో వ్రత సమాప్తమౌతుంది. భగవంతునకు నివేదించినదే మనం తీసుకోవాలనే నియమము తప్ప. ఆయనకు వ్రత విధానం లేదు. నివేదన, విసర్జనము కాన వ్రత నియమమే నివేదనం చేసి పారాయణ చేయుట సంప్రదాయం.