మంత్రిగా పుల్లారావు రికార్డు

Published: Wednesday July 25, 2018

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆనాడు ఎన్టీఆర్‌ కేబినెట్‌లో కానీ, à°† తరువాత చంద్రబాబు కేబినెట్‌లో కానీ అమాత్య పదవులను అందిపుచ్చుకునే అవకాశం ఎంతో మందికి వచ్చింది. అయితే అప్పుడు కానీ ఇప్పుడు కానీ వరుసగా ఐదేళ్ళు మంత్రి పదవిని నిర్వహించే అవకాశం వేరువేరు కారణాల మూలంగా ఎవరికీ దక్కలేదు. శాసన సభ స్పీకర్‌à°—à°¾ వ్యవహరిస్తున్న డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌కు ఎన్టీఆర్‌, à°† తరువాత చంద్రబాబు కేబినెట్‌లోనూ నాలుగు పర్యాయాలు మంత్రి పదవులను చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ వేరువేరు కారణాల మూలంగా ఐదేళ్ళు కొనసాగే అవకాశం దక్కలేదు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి రావడంతో వ్యవసాయ శాఖను ఆయనకు అప్పగించారు. వచ్చిన అవకాశాన్ని ఆయన చేజార్చుకోకుండా శాఖాపరంగా సమర్ధవంతంగా పనిచేయటమే కాకుండా నవ్యాంధ్ర ఏర్పాటులో కీలక ఘట్టమైన భూసేకరణ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు. తరువాత జరిగిన శాఖల మార్పిడి సమయంలో పౌరసరఫరాల శాఖను ఇచ్చి తన కేబినెట్‌లో కొనసాగే అవకాశం పుల్లారావుకు ఇచ్చారు. ఐదేళ్ళు ముగిసేందుకు ఇంకా కొన్ని నెలలు ఉన్నప్పటికీ ఆయన పదవికి ఎటువంటి ఢోకా లేదని చెప్పవచ్చు.