2500 పింఛన్లు

Published: Thursday July 26, 2018
గ్రామ దర్శిని’ కార్యక్రమంలో భాగంగా వారంలో రెండు రోజులు గ్రామాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. à°ˆ సందర్భంగా వచ్చే వినతులు పరిశీలించి అప్పటికప్పుడే పరిష్కరించేందుకు వీలుగా ఒక్కో కలెక్టర్‌కు రూ.25 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే... అర్హులైన వారికి తక్షణం మంజూరు చేసేలా ఒక్కో కలెక్టర్‌కు 2500 సామాజిక పెన్షన్లను కేటాయిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికి ఇళ్లను కూడా మంజూరు చేసే అవకాశం కల్పించారు.
 
బుధవారం సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఆరుగురు కలెక్టర్లతో ముఖాముఖి కూడా చర్చించారు. గ్రామ దర్శినిలో కలెక్టర్లు ఊరికే పాల్గొని రావడం కాదని... అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించి, ప్రజలకు ఊరటకల్పించేలా నిధులు, అధికారాలు ఉండాలని నిర్ణయించారు. ఒక్కో కలెక్టర్‌కు రూ.25కోట్లు ఇచ్చి.. వాటిని ఉపాధి హామీతో అనుసంధానిస్తే రూ.60కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇవ్వొచ్చని చంద్రబాబు తెలిపారు. రేషన్‌ పంపిణీలో బయోమెట్రిక్‌ ఇబ్బందులు ఉన్నచోట ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని అమలు చేయాలని సూచించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికే à°ˆ విధానం అమలులో ఉందన్నారు.
 
కర్నూలు, à°•à°¡à°ª జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తికావాలన్నారు. కాపు కార్పొరేషన్‌, బీసీ సమాఖ్యలకు సబ్సిడీ విడుదల కావాల్సి ఉందని అనుకున్నారు. చిత్తూరు, కర్నూలు, à°•à°¡à°ª, ప్రకాశం, అనంతపురం తదితర ఆరు జిల్లాల కలెక్టర్లతో సీఎం ముఖాముఖి చర్చించారు. మరో ఏడు జిల్లాల కలెక్టర్లతో గురువారం సమావేశం కానున్నారు. విభజనతో కష్టాల సుడిలో పడిన రాష్ట్రాన్ని నాలుగేళ్లలోనే గాడిన పెట్టడంలో అధికారుల పాత్ర కీలకమైనదని చంద్రబాబు అన్నారు.
 
 
నాలుగేళ్లలో రాష్ట్రానికి చెందిన 236 మందికి 511జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ఇది ఉన్నతాధికారుల సమర్థతకు గుర్తింపు అని తెలిపారు. అవార్డులు సాధించిన వారిని ఉండవల్లిలోని గ్రీవెన్స్‌హాలులో చంద్రబాబు సన్మానించారు. ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ‘‘నేను బృంద నాయకుడిని మాత్రమే. క్రెడిట్‌ బృందానికే దక్కుతుంది. ఇప్పటిదాకా మనం అంతర్జాతీయ స్థాయి లక్ష్యాలను ఏర్పరుచుకున్నాం. ఇప్పుడు... అంతర్జాతీయంగా మనమే బెస్ట్‌ కాగలమని నిరూపించారు. ప్రపంచమంతా మనవైపే చూసే రోజు అతి త్వరలోనే ఉంది. à°ˆ వాతావరణం, ఉత్సాహం చూశాక నాలో నమ్మకం పెరిగింది. అందరికీ అభినందనలు’’ అని ఆయన తెలిపారు. జాతీయస్థాయిలో పలు పురస్కారాలు అందుకొన్న పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల అధికారులను, మంత్రి లోకేశ్‌ను అభినందించారు.