ఒకేసారి ప్రభుత్వ ప్రకటన

Published: Friday July 27, 2018

ఒకేసారి ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే నెల 2à°µ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో à°ˆ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశం ఉంది. కేబినెట్‌ ఆమోదం తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా వీటి నియామకాలు చేపట్టనున్నారు. à°ˆ నెల 6à°µ తేదీనే 10,351 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వస్తుందనిఅంతా భావించారు. కానీ, ఆర్థిక శాఖ కొర్రీలు వేయడంతో à°† నోటిఫికేషన్‌ అనుకున్న సమయానికి రాలేదు. à°† టీచర్‌ పోస్టులతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోని ఖాళీలను ఒకేసారి భారీస్థాయిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. à°ˆ మేరకు అన్ని శాఖలు పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది. ఇప్పటికే గుర్తించిన 10వేల టీచర్‌పోస్టులు కాకుండా... వివిధ శాఖల్లో మరో పదివేలకుపైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఇందులో అత్యధికంగా పోలీసు శాఖ నుంచి 4 వేల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆర్థిక శాఖ దాదాపు 3 వేల పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశముంది. ఇందులో అధిక శాతం కానిస్టేబుల్‌ పోస్టులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే, వైద్య ఆరోగ్య శాఖ 1600 పోస్టుల భర్తీకి ప్రతిపాదన పంపింది. వీటన్నింటి భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే... ఇదే తరహాకు చెందిన మరో 400 పోస్టులను కలిపి వైద్య ఆరోగ్య శాఖలో 2000 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని భావిస్తోంది. ప్రజా సంక్షేమం, వైద్య సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో à°† శాఖకు అవసరమైనన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ తెలిపేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉంది. పంచాయతీ రాజ్‌శాఖ నుంచి 1500 పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఆర్థిక శాఖ వీటిని యథాతథంగా ఆమోదించే అవకాశం ఉంది. నవ్యాంధ్రలో గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి కుటుంబానికి కనీసం పదివేల ఆదాయం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటన్నింటిని సక్రమంగా నిర్వహించేందుకు తగిన అధికార యంరత్రాంగం ఉండాలనే యోచనతో... పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి సిద్ధమైంది.