ప్రజల వద్దకే పాలన : నారా లొకెష్

Published: Monday January 08, 2018

అనంతగిరి: ‘గతంలో సమస్యలను పరిష్కరించాలని అధికారుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేసే వారు. ఇప్పుడు ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలేంటో తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తునారు. ప్రజల వద్దకు పాలనే జన్మభూమి మాఊరు లక్ష్యమ’ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. అనంతగిరి మండల పర్యటనకు ఆదివారం వచ్చిన మంత్రి టోకూరు పంచాయతీ బగ్మార్‌వలసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని à°ˆ విధంగా ప్రసంగించారు. à°—à°¤ ప్రభుత్వాలకు ప్రస్తుత తెదేపా ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలందరూ గమనించాలన్నారు. సమస్య ఎక్కడ ఉందో అక్కడకే అధికారులను పంపి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జన్మభూమి గ్రామసభల్లో సమస్యలను గుర్తించడంతోపాటు నూతనంగా మంజూరైన రేషనుకార్డులు, పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఎన్టీఆర్‌ గృహాలు, పింఛన్లు, రేషనుకార్డుల మంజూరుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. వేసవికి ముందే తాగునీటి సమస్యను అధిగమించేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు. మన్యంలో మారుమూల గ్రామాలకు రహదారులను నిర్మిస్తున్న ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని చెప్పారు. మన్యంలో తాగునీటి వసతుల కల్పనకు రూ.160 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రూ.3300 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా తాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో మొదటి విడతగా రూ.1500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.