9 నగరాల నిర్మాణంలో నిపుణుల సూచనలు

Published: Monday July 30, 2018
అమరావతి రాజధాని ప్రాజెక్టుకు అంతర్జాతీయ సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తోందని, à°ˆ నేపథ్యంలో ఢిల్లీలో జాతీయ స్థాయి వర్క్‌షాపులు ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రణాళికలను వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. సీఆర్‌డీఏ అధికారులతో సీఎం ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో 9 ప్రతిపాదిత నగరాలతో అమరావతిని ప్రపంచంలోని ఉత్తమ సంతోష నగరంగా, నవకల్పనల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను వివరించాలని సీఎం సూచించారు. అమరావతి మీడియా సిటీపై ఢిల్లీలో ఇప్పటికే వర్క్‌షాప్‌ నిర్వహించామని, అలాగే క్రీడలు, ప్రభుత్వ, న్యాయ, ఆర్థిక, నాలెడ్జి, పర్యాటక, ఎలకా్ట్రనిక్స్‌, ఆరోగ్య నగరాల అభివృద్ధి ప్రాజెక్టులపైనా వర్క్‌షాపులు నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించాలని చెప్పారు. ఆయా నగరాలను విశిష్ఠ పాలన, ఉపాధి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చాలని అన్నారు. à°ˆ తొమ్మిది నగరాల నిర్మాణంలో సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ అంతర్జాతీయ నిపుణులను ఆహ్వానించాలని సూచించారు. ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో అమరావతి à°’à°•à°Ÿà°¿à°—à°¾ నిలుస్తుందన్న నమ్మకం తనకుందని, దేశ అభివృద్ధిలోనూ కీలకంగా మారుతుందని అన్నారు. రాజధాని ప్రాంతంలో 9 నగరాల ఏర్పాటు మరే దేశంలోనూ లేదన్నారు.
 
à°ˆ నగరాలు ప్రజలకు ప్రపంచశ్రేణి జీవన ప్రమాణలను కల్పించడమే గాక జనం ఎప్పుడూ సంతోషంగా ఉండేందుకు దోహదపడతాయన్నారు. అమరావతి అభివృద్ధి ఫలాలు రాష్ట్రమంతటికీ చేరతాయని, అదే ప్రభుత్వ విధానమని చెప్పారు. à°—à°¡à°šà°¿à°¨ నాలుగేళ్లలో అన్ని హామీలు నెరవేర్చామని చెప్పిన చంద్రబాబు... రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. డిసెంబర్‌లోగా అమరావతికి à°’à°• రూపు తీసుకొస్తే అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు కచ్చితంగా ముందుకొస్తాయని స్పష్టం చేశారు. సీఎం పిలుపు మేరకు రాష్ట్రానికి చెందిన చుక్కపల్లి ఆకాశ్‌ నేతృత్వంలోని యువ వాణిజ్యవేత్తల బృందం అమరావతి నిర్మాణ కార్యక్రమాల్లో అనుసరించాల్సిన అంతర్జాతీయ విధానాలపై అధ్యయనం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిందని తెలిపారు. అజయ్‌జైన్‌ 9 నగరాల కాన్సె్‌ప్టను వివరిస్తూ... ఆర్థిక నగరాన్ని 2,091 హెక్టార్లలో ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడల నగరంలో భారీ స్టేడియాలు, వేదికలు, అంతర్జాతీయ క్రీడలు నిర్వహణకు ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. మీడియా సిటీని 2067 హెక్టార్లలో ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణానది తీరం వెంట పర్యాటక నగరం ఏర్పాటు చేస్తామని వివరించారు. మంత్రి నారాయణ, సీఎం ప్రత్యేక సీఎస్‌ సతీ్‌షచంద్ర, ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్‌, ఏడీసీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్థసారధి, సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.