అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం

Published: Monday July 30, 2018

 à°…గ్రిగోల్డ్‌ సంస్థలో చేసిన డిపాజిట్లు సకాలంలో తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న డిపాజిటర్ల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడినవారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం చెక్కులు పంపిణీ చేయనున్నారు. à°ˆ మేరకు బాధితుల జాబితాను రాష్ట్ర సీఐడీ అధికారులు సిద్ధం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో డిపాజిటర్లతోపాటు ఏజెంట్లు కూడా ఉన్నట్లు సమాచారం. విజయవాడలో ప్రారంభమైన అగ్రిగోల్డ్‌ సంస్థ దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించింది. ఒక్క ఏపీలోనే 20 లక్షల మంది అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేశారు. బాండ్ల గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవడంతో పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కువ కేసులు నమోదవడంతో ప్రభుత్వం à°ˆ అంశాన్ని సీఐడీకి బదిలీ చేసింది. దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు వివిధ రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌ సంస్థతోపాటు, సంస్థలోని డైరెక్టర్లు, ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్న వారి ఆస్తులను కూడా జప్తు చేశారు. ఆస్తుల వేలం ప్రక్రియ కోర్టు పర్యవేక్షణలో కొనసాగుతోంది.