క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన నిహారిక

Published: Wednesday August 01, 2018
ఇటీవల ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం క్యాస్టింగ్ కౌచ్. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు క్యాస్టింగ్ కౌచ్‌ను మేము ఎదుర్కొన్నామని బహిరంగంగా వెల్లడిస్తూ ఉంటే.. మరికొందరు అలాంటివేం లేవని చెప్పుకొస్తున్నారు. à°ˆ విషయమై తాజాగా à°“ ఇంటర్వ్యూలో మెగా డాటర్ నిహారిక కొణిదెల స్పందించింది.
 
‘‘సినీ ఇండస్ట్రీ ఒక్కదానిలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పడమైతే చాలా తప్పు. నేను చాలా స్టోరీస్ చూశాను.. విన్నాను. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలా జరుగుతుంది. కానీ నువ్వు తల ఊపకుంటే ఏదీ జరగదు. నీ ప్రమేయం లేకుండా ఎవరైనా ఏదైనా చేశారు అంటే అది సెక్సువల్ హర్రాష్ à°²à±‡à°¦à°‚టే సెక్సువల్ రేప్. అది అయిపోయాక వచ్చి వాళ్లు చేశారు.. వీళ్లు చేశారు అని చెబితే తప్పు. మీరు ఎస్ అనకుండా ఏమీ జరగదు. నిజంగానే నాకు ఇది తప్ప వేరే దారే లేదు అనుకుంటే అప్పుడు నువ్వది చెయ్యాలి. నేను ఫ్రాంక్‌à°—à°¾ వాళ్ల సిట్యుయేషన్‌లో ఉండి మాట్లాడను.. ఎందుకంటే నా బ్యాక్ గ్రౌండే డిఫరెంట్. నేను బయటి నుంచి వచ్చిన అమ్మాయిల్లా మాట్లాడలేను. నాకు అవగాహన లేదు. నేను మాట్లాడినా కూడా అది తప్పు అవుతుంది. వాళ్ల ప్లేసులో  ఉండి నేను మాట్లాడలేను’’ అని తెలిపింది నిహారిక.