మోదీని ప్రశ్నించిన చంద్రబాబు

Published: Wednesday August 01, 2018
 à°ªà±à°°à°§à°¾à°¨à°¿ మోదీని సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. అవినీతి పార్టీని నమ్ముకుని నీతులు మాట్లాడుతున్నారని, అవినీతిని ప్రక్షాళన చేస్తానని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని à°ˆ సందర్భంగా గుర్తు చేశారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారని, వైసీపీ కేసులు ప్రధానికి కనబడలేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఏ1, ఏ2ను పీఎంవో ఆఫీస్‌లో కూర్చోబెట్టుకున్నారని, జైలు భయంతోనే వైసీపీ నేతలు à°Šà°¡à°¿à°—à°‚ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి రైల్వేజోన్‌ ఇస్తామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ రాజ్యసభలో ప్రకటించారని, సుప్రీంలో వేసిన అఫిడవిట్‌లో రైల్వే జోన్ ఇవ్వలేమన్నారని చెప్పారు.
 
విభజన హామీలపై వైసీపీ, జనసేన ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు. తనది యూటర్న్‌ కాదని, రైట్‌ టర్న్అని చంద్రబాబు స్పష్టం చేశారు. అడ్డదారుల్లో వెళ్తూ తనను విమర్శిస్తారా అంటూ మరోసారి ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోపాటు అన్ని డిమాండ్లు సాధించుకుంటామని, à°•à°¡à°ª స్టీల్‌ప్లాంట్‌ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. అనుమతి ఇస్తే స్టీల్‌ప్లాంట్‌ తామే ఏర్పాటు చేసుకుంటామని చెప్పామని బాబు స్పష్టం చేశారు. ‘‘వైసీపీ అవగాహన లేని పార్టీ. నాలుగు ఓట్లు వేస్తే కేసుల మాఫీ కోసం ఉపయోగిస్తారు. అవగాహన లేని నాయకులు రాజకీయాలు చేస్తే లాభం లేదు. నేను ఎవరికీ భయపడను. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.