యువతకు భృతి... శిక్షణ... కొలువు

Published: Friday August 03, 2018
వేదిక ఒక్కటే! ఉపయోగాలు అనేకం! నిరుద్యోగ భృతి చెల్లించేందుకు... నిరుద్యోగులు తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొందేందుకు... పరిశ్రమ వర్గాలు తమకు అవసరమైన వారిని ఎంచుకునేందుకు! ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇది అతిపెద్ద ‘ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌’! ఇంటర్నెట్‌ సౌకర్యంతో ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌కు వెళితేచాలు! à°ˆ పోర్టల్‌ రూపకల్పనలో ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్‌ కీలకపాత్ర పోషించారు. పలు శాఖలు, విభాగాలు, కార్పొరేషన్‌లు, నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు అనేక సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు సమీక్షించారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పోర్టల్‌ను అత్యంత పకడ్బందీగా తయారీకి లోకే శ్‌ సుమారు 600 గంటలు శ్రమించారు. గురువారం మంత్రివర్గం అధికారికంగా ప్రకటించిన నిరుద్యోగ భృతి కోసం నమోదు ఎలా.. తదితర అంశాలు ఒక్కసారి పరిశీలిస్తే...
 
నమోదు ఇలా...
నిరుద్యోగ భృతి కోరే యువతీ యువకులు దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి. వారికి à°’à°• ఓటీపీ నంబరు వస్తుంది. అది ఎంటర్‌ చేసి.. ఇదే వెబ్‌పోర్టల్‌లోనే దరఖాస్తు నింపాలి. పాలిటెక్నిక్‌, డిగ్రీ సమానార్హత ఉండి... 22 నుంచి 35ఏళ్ల మధ్య వయసున్న వారే దీనికి అర్హులు. అర్హత లేకపోతే అప్పటికప్పుడే ‘రిజెక్ట్‌’ చేస్తారు. అన్నీ ఓకే అయితే... అప్పటికప్పుడే భృతిని మంజూరు చేస్తారు.
 
 
పరిశ్రమలకు ఇలా ఉపయోగం
నిరుద్యోగ భృతి వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకునే వారి వివరాలను పరిశ్రమవర్గాలు కూడా తెలుసుకోవచ్చు. వారికి ప్రత్యేక లాగిన్‌ కేటాయిస్తారు. దీనిద్వారా తమకు అవసరమైన అర్హతలున్న నిరుద్యోగుల వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించవచ్చు. వివిధ రకాల అర్హతలు, నైపుణ్యం ఉన్న యువత జాబితా ఒకే వేదికపై మరెక్కడా లభ్యం కాదని, ఇది కంపెనీలకు చక్కటి అవకాశమని పెద్దఎత్తున ప్రచారం చేయనున్నారు.
 
 
జాబ్‌ పోర్టల్‌ అనుసంధానం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో క్రమం తప్పకుండా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన జాబ్‌ పోర్టల్‌ను కూడా నిరుద్యోగ భృతి వెబ్‌సైట్‌తో అనుసంధానిస్తారు. ఎక్కడ ఎలాంటి కొలువుల ప్రకటనలు వెలువడినా దీని ద్వారా తెలుసుకోవచ్చు. నైపుణ్య శిక్షణ కోసం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పలు శాఖల్లోని పథకాలు, కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు కసరత్తు చేశారు. దీనికోసం ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతోపాటు సంబంధిత మంత్రులతోనూ పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ప్రకటించి, దానిని విజయవంతంగా అమలు చేయలేని రాష్ట్రాల అనుభవాలను తెలుసుకున్నారు. లోటుపాట్లను ముందుగానే గుర్తించారు. అలాంటి పొరపాట్లు ఇక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.