పింగళి జెండా స్ఫూర్తి

Published: Friday August 03, 2018

భారతీయులంతా సగర్వంగా తలెత్తి, గౌరవించే త్రివర్ణ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనకు గర్వకారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ఏపీ భవన్‌లో పింగళి వెంకయ్య 142à°µ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పింగళి వెంకయ్య సృష్టించిన జాతీయ జెండా ఎందరో దేశభక్తులకు స్ఫూర్తినిచ్చిందని, దేశభక్తిని, సారనాథ్‌ స్థూపంలోని అశోకచక్రాన్ని పొందుపరిచి జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన పింగళి కృషిని గాంధీ స్వరాజ్య పత్రికలో ప్రశంసించారని చెప్పారు. భూగర్భ శాస్త్రంలో ఖనిజాలు, వజ్రాల గురించి పరిశోధనలు చేసిన ఉన్నత పరిశోధకుడిగా, సైనికుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, బహుభాషా కోవిదుడిగా, వ్యవసాయ శాస్త్రవేత్తగా పింగళి సాధించిన విజయాలు à°’à°• ఎత్తయితే జాతీయ పతాక రూపకల్పన మరో ఎత్తు అని వెంకయ్య కొనియాడారు.