సీఎం చెప్పినా చేయరా.. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది

Published: Saturday August 04, 2018
రాష్ట్రంలో చుక్కల భూముల చట్టం అమలు, నిషేధిత భూముల జాబితా 22-ఏ కేసుల పరిష్కారంలో తీవ్రజాప్యం చోటుచేసుకుంటోందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. à°ˆ విషయాలపై జాయింట్‌ కలెక్టర్లు శ్రద్ధ పెట్టడం లేదని, ప్రజలకు భూమి కష్టాలు మరింతగా పెరిగిపోయాయని ఆగ్రహించారు. చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోందని జేసీలపై మండిపడ్డారు. చుక్కల భూముల చట్టం-2017 అమలు, 22-ఏ కేసుల పరిష్కారంపై శుక్రవారం ఇక్కడి ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది.
 
భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) అనిల్‌ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన à°ˆ భేటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా కేఈ మాట్లాడుతూ.. రెండు కీలక అంశాల్లో తమకు అధికారులు న్యాయం చేయడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. à°ˆ సమస్యల పరిష్కరించాలని సీఎం చంద్రబాబు స్వయంగా సూచించినా క్షేత్రస్థాయిలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. చుక్కల భూముల చట్టం తీసుకొచ్చి 13 నెలలు కావొస్తున్నా అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులెవరో సమాధానం చెప్పాలని గట్టిగా నిలదీశారు.
 
ఆ ఆదేశాలు ఎందుకు అమలు కావు?
స్వాతంత్య్ర సమర యోధులు, మాజీ సైనికోద్యోగులకు ఇచ్చిన భూముల్లో ప్రభుత్వంతో వివాదం ఉన్నవి తప్ప మిగిలిన వాటికి పదేళ్ల అసైన్‌మెంట్‌ గడువు ముగిసిన తర్వాత ఎలాంటి నిరభ్యంతర పత్రం అక్కరలేదని ఆదేశాలు ఇచ్చినా.. అమలు కావడం లేదని కేఈ ఆక్షేపించారు. ఎన్‌వోసీలు అవసరం లేదని చెప్పాక, సమరయోధులు అధికారుల వద్దకు ఇంకా ఎందుకు వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. సమరయోధులకిచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. పై స్థాయిలో ఇచ్చే ఉత్తర్వులు అమలుకాకపోతే పాలనా యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకం పోతుందన్నారు.