క్వారీ ప్రమాదంపై భిన్న కథనాలు

Published: Saturday August 04, 2018
వలస కూలీల బతుకులు ఛిద్రమయ్యాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటనలో ఒడిసా, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు. à°ˆ ఘోరం ఎలా జరిగిందనే అంశంపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. à°’à°• కథనం ప్రకారం... కూలీలు వంట చేసుకుంటుండగా అక్కడే నిల్వ చేసిన మందుగుండుకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. మరో వాదన ప్రకారం... క్వారీలోనే పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు, అధికారులు అందించిన సమాచారం ప్రకారం...
 
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ గ్రామ సమీప కొండల్లో మూడు ఎకరాల్లో à°’à°•à°Ÿà°¿, ఆరు ఎకరాల్లో మరొకటి చెప్పున రెండు క్వారీలున్నాయి. వీటిని చిప్పగిరి మండలం ఏరూరుకు చెందిన స్థానిక టీడీపీ నాయకుడు శ్రీనివాస చౌదరి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. రహదారుల నిర్మాణంలో ఉపయోగించే à°•à°‚à°•à°° కోసం కొండను పిండి చేస్తుంటారు. బ్లాస్టింగ్‌ పనుల కోసం ఒడిసా, జార్ఖండ్‌కు చెందిన 30 మంది కూలీలను నియమించుకున్నారు. వీరంతా క్వారీలకు సమీపంలోనే తాత్కాలికంగా షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి వంట చేసుకుంటుండగా... ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి.
 
అవి... అక్కడే నిల్వ చేసిన క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగించే జెలిటెన్‌ స్టిక్స్‌, ఇతర మందుగుండు సామగ్రికి వ్యాపించాయి. దీంతో ఒక్కసారి భారీ పేలుళ్లు జరిగాయి. మంటలు చెలరేగాయి. à°’à°• లారీ, మూడు ట్రాక్టర్లు, షెడ్లు, పలు యంత్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. పేలుళ్ల ధాటికి హత్తి బెళగల్‌ గ్రామంలో ఐదుకుపైగా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ శబ్దాలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరిన్ని పేలుళ్లు జరుగుతాయనే ఆందోళనతో చాలాసేపటి వరకు ఎవ్వరూ సంఘటన స్థలం వద్దకు వెళ్లేందుకు సాహసించలేదు. చిమ్మచీకటి కావడంతో మృతదేహాలను గుర్తించడం కూడా కష్టసాధ్యంగా మారింది. చెల్లాచెదురుగా శవాలు, మంటలతో అక్కడ పరిస్థితి భయానకంగా కనిపించింది. మరోవైపు... క్వారీలోనే పేలుళ్లు జరిగినట్లు కూడా చెబుతున్నారు. మృతదేహాలు నల్లగా కమిలిపోయాయి. à°ˆ ఘటనలో ఐదుగురు గాయపడినట్లు తెలుస్తోంది.