రేపు సీఎం సమక్షంలో ఎంవోయూ

Published: Sunday August 05, 2018

అమరావతి: à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°¨à°¿à°•à°¿ త్వరలో భారీ ఎలకా్ట్రనిక్‌ కంపెనీ రాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సోమవారం à°† కంపెనీతో కీలక అవగాహనా ఒప్పందం కుదరనుంది. అయితే, సదరు కంపెనీని దక్కించుకోవాలని ఇతర రాష్ట్రాలూ పోటీ పడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి వివరాలను గోప్యంగా ఉంచుతోంది. ఇప్పటిదాకా దేశంలో ఎలకా్ట్రనిక్‌ అసెంబ్లింగ్‌ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయిలో ఎలకా్ట్రనిక్స్‌ తయారీ కంపెనీ రాబోతోందని రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో కృష్ణ కిశోర్‌ వెల్లడించారు. మొబైల్‌ ఫోన్ల తయారీలో వినియోగించే మాడ్యూల్స్‌, టీఎఫ్టీ స్కీన్‌లను à°ˆ కంపెనీ తయారు చేస్తుంది. తిరుపతి ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ -2లో ఏర్పాటు కానున్న à°ˆ కంపెనీ వివరాలను సీఎం సమక్షంలో ఎంవోయూను ఖరారు చేసుకొనే సమయంలో వెల్లడిస్తామని కృష్ణ కిశోర్‌ వివరించారు. à°ˆ కంపెనీ రెండు మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతుందని చెప్పారు. ‘‘1,400 కోట్ల రూపాయల పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకువస్తుంది. ఆరువేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది’’ అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే ఎలకా్ట్రనిక్స్‌ హబ్‌à°—à°¾ వేగంగా రూపుదిద్దుకొంటున్నదని, à°ˆ రంగంలో ఇప్పటి వరకూ 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ‘‘మొబైల్‌ తయారీ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్‌లో 15,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. తిరుపతి ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫాక్యరింగ్‌ క్లస్టర్‌లో సెల్‌కాన్‌, డిక్సన్‌ వచ్చాయి. త్వరలోనే కార్బన్‌ కూడా రానుంది. 125 ఎకరాల్లో జియో మొబైల్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ తయారీ మెగా కంపెనీ కూడా ఏర్పాటు కానున్నది. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ ఇన్వెకాస్‌ రాష్ట్రంతో ఇటీవలే ఒప్పందం చేసుకుంది. లిథియం ఐయాన్‌ బ్యాటరీ తయారీ కంపెనీ మనోత్‌ కూడా ఏపీకి రానున్నది’’ అని కృష్ణకిశోర్‌ తెలిపారు. ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో రెండు లక్షల మందికి ఉద్యోగాల కల్పనేలక్ష్యంగా మంత్రి లోకేశ్‌ కృషి చేస్తున్నారన్నారు. ఇందుకోసం అనేక కంపెనీల ప్రతినిధులతో, ఎకనామిక్స్‌ ఫోరాలలో లోకేశ్‌ సంప్రదింపులు జరుపుతూ వచ్చారని, à°† ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో నంబర్‌ వన్‌ స్థానం దక్కడం, ఎంఓయూ కన్వెర్షన్‌లో రెండో స్థానంలో ఉండడంతో పెట్టుబడి అవకాశాలు పెరిగాయని వివరించారు. వచ్చే నెల నుంచి ప్రతి నెలా à°’à°•à°Ÿà°¿ రెండు కంపెనీలు రాష్ట్రానికి వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు.