‘రాయల’ మణిహారం మన్నవరం మూత

Published: Wednesday August 08, 2018
 à°¨à°µà±à°¯à°¾à°‚ధ్రపై మోదీ ప్రభుత్వ వివక్ష మరోసారి బట్టబయలైంది. రాయలసీమపై బీజేపీ నేతలు ఒలకబోస్తున్న ప్రేమ.. బూటకమని తేలిపోయింది. సీమకే మణిహారంలాంటి మన్నవరం ప్రాజెక్టును మూసివేసింది. చిత్తూరు జిల్లా మన్నవరంలోని à°ˆ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించనున్నారని రెండేళ్ల క్రితమే వార్తలొచ్చాయి. దీనిపై ప్రజాప్రతినిధులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మూతవేయడం లేదని దాటవేస్తూనే.. చివరకు కేంద్రం మూతబండ వేసేసింది. à°ˆ ప్రాజెక్టు లాభదాయకంగా లేదని.. మూడేళ్లుగా నష్టాల్లో ఉందంటూ దీనిని మూసివేయాలని నిర్ణయించామని కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్‌కే సింగ్‌ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. à°ˆ ప్రకటనతో రాష్ట్ర ప్రజలు.. ముఖ్యంగా సీమవాసులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీమకు అన్యాయం చేస్తున్నారని.. అక్కడి ప్రాజెక్టులు పూర్తిచేయడం లేదంటూ బీజేపీ నేతలు విమర్శిస్తూ.. రాయలసీమ డిక్లరేషన్‌ తెచ్చిన సంగతి తెలిసిందే.
 
కానీ వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేసిన రూ.350 కోట్ల నిధులను ఇచ్చినట్లే ఇచ్చి కేంద్రం వెనక్కి తీసుకుంది. వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిచేందుకు అవకాశమున్న à°•à°¡à°ª ఉక్కు కర్మాగారాన్ని అటకెక్కించింది. ఇప్పుడు యువత ఆశలకు గండికొడుతూ మన్నవరం ప్రాజెక్టును మూసేయడం తమ గుండెలో గునపం దించడమేనని సీమవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మోదీ తెగేసిచెప్పారు. ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీకి అతీగతీ లేదు. రైల్వే జోన్‌ అదిగో ఇదిగో కాలయాపన చేస్తున్నారు. విభజన హామీలన్నీ తుంగలో తొక్కారు. జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటుచేశామని ఘనంగా చెప్పుకొంటూ.. ఒక్క భవనాన్ని కూడా నిర్మించకుండా.. అరకొరగా నిధులిస్తున్నారు.. ఇప్పుడు సీమకు వరప్రసాదమని భావిస్తున్న మన్నవరం ప్రాజెక్టును కూడా లాగేసుకున్నారు. మంగళవారం సీమకి ‘బ్లాక్‌డే’à°—à°¾ పార్టీలు, మేధావులు నిరసన వ్యక్తంచేస్తున్నారు.