మహిళా ఓట్లే లక్ష్యంగా జనసేన

Published: Wednesday August 15, 2018
మహిళా ఓట్లే లక్ష్యంగా సంక్షేమ పంథాలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తన ఎన్నికల మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంటును రూపొందించారు. వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అందులో హామీ ఇచ్చారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు కోటా ఇస్తూనే.. బీసీల రిజర్వేషన్లను మరో ఐదు శాతం పెంచుతామని.. ఆర్థికంగా వెనుకబడినవారిని కూడా ఆదుకుంటామని అందులో హామీలు గుప్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం మావుళ్లమ్మ తల్లి పాదాల వద్ద ఉంచిన 2019 విజన్‌ డాక్యుమెంటు తొలి ప్రతిని ఆయన తన పార్టీ మహిళా కార్యకర్తలకు అందజేశారు. అందులో 11 ప్రత్యేక హామీలిచ్చారు. మేనిఫెస్టో సంపూర్ణ ప్రతిని త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. à°ˆ డాక్యుమెంటులోని 11 కీలకాంశాలూ ఇవీ..
 
  • మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు.
  • గృహిణులకు ఉచితంగా వంటగ్యాస్‌ సిలెండర్లు.
  • రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500.
  • బీసీ రిజర్వేషన్లు అవకాశాన్ని బట్టి మరో 5 శాతం పెంపు. చట్టసభల్లో వారికి రాజకీయ రిజర్వేషన్లు.
  • కాపులకు 9à°µ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్లు.
  • ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం.
  • ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్‌.
  • à°† వర్గాల విద్యార్థులకు వసతి గృహాలు.
  • ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాల అమలు.
  • ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు.
సమాజంలోని అన్ని వర్గాలనూ స్పృశించిన పవన్‌.. యువతకు ఉపాధి కల్పన.. పారిశ్రామికీకరణ విధానాలపై విజన్‌ డ్యాకుమెంటులో మౌనం వహించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
 
 
మావుళ్లమ్మ, పంచారామ క్షేత్రాలను సందర్శించిన పవన్‌
రెండు రోజుల క్రితం ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తానన్న పవన్‌.. మంగళవారం తొలుత పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దనస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మావుళ్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. డాక్యుమెంటును అమ్మవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.