పోలవరం ప్రాజెక్టు పనులపై వస్తు సేవా పన్ను

Published: Thursday August 16, 2018
 à°ªà±‹à°²à°µà°°à°‚ ప్రాజెక్టు పనులపై వస్తు సేవా పన్ను (జీఎస్‌à°Ÿà±€) దెబ్బ పడుతోంది. ప్రధాన పనుల నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టు సంస్థలు జంకుతున్నాయి. ఎగువ దిగువ కాఫర్‌ డ్యాంలు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మాణ పనుల్లో తమకు మిగలడం మాటెలా ఉన్నా.. జీఎస్‌à°Ÿà±€ దెబ్బతో కోట్లలో నష్టం వాటిల్లుతుందని అవి చెబుతున్నాయి. వీటి పనుల్ని మరో నిర్మాణ సంస్థ ‘రత్న’తో చేయిస్తామని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన ట్రాన్‌స్ట్రాయ్‌.. జీఎస్‌à°Ÿà±€ లెక్కలు వేశాక తటపటాయిస్తోంది.
 
 
à°ˆ పనులు చేపట్టడానికి తానూ రెడీ అన్న నవయుగ సంస్థ కూడా వెనకాముందూ ఆడుతోంది. 2010-11 ధరల ప్రకారం వీటి పనులు చేపడితే.. యూనిట్‌కు రూ.12 నుంచి రూ.18 దాకా నష్టం వాటిల్లుతుందని.. నష్టం మొత్తం రూ.వందల కోట్లలో ఉంటుందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించకుండా.. రాష్ట్రంలో జల వనరుల శాఖ జీఎస్‌టీని అమల్లోకి తేవడంతో కాంట్రాక్టు సంస్థలపై భారీగా భారం పడుతోందని.. ఫలితంగా నిర్మాణాలకు సంస్థలేవీ ముందుకు రావడం లేదని à°† శాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
 
ఉన్నతాధికారులపై చంద్రబాబు అసంతృప్తి..
గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబరు 1 నుంచి కాఫర్‌ డ్యాంలు, రాక్‌ఫిల్‌ డ్యాం పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు అక్టోబరు మొదటి వారానికే యంత్రాలు, ఇతర వాహనాలను కాంట్రాక్టు సంస్థ సిద్ధం చేసుకోవాలి. అలా చేయాలంటే సెప్టెంబరులోనే నిర్మాణ సంస్థను గుర్తించాలి. ఈలోగా వాటి డిజైన్లను సిద్ధం చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా అధికారులు à°ˆ దిశగా అడుగులు వేయలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, కాఫర్‌ డ్యాం, రాక్‌ఫిల్‌ డ్యాంల పనులకు 60-సీ à°•à°¿à°‚à°¦ ట్రాన్‌స్ట్రాయ్‌కు నోటీసులు జారీ చేసి.. కొత్తగా టెండర్లు పిలవాలా.. లేక నామినేషన్‌ విధానంలో పనులు కట్టబెట్టలా అనేది జల వనరుల శాఖ తేల్చుకోలేకోపతోంది.
 
 
గతంలో స్పిల్‌ వే, చానల్‌ కాంక్రీట్‌ పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమైనప్పుడు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ దానికి సమ్మతించలేదు. దీంతో పాతధరలకే చేపట్టేందుకు ముందుకొచ్చిన నవయుగ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలను క్షేత్రస్థాయిలో బేరీజు వేయడానికి కేంద్ర జల సంఘం బృందం à°ˆ నెలాఖరులో లేదా సెప్టెంబరు మొదటి వారంలో పర్యటనకు రావచ్చని తెలిసింది. తుది అంచనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రం కోరిన ఫార్మాట్‌లో సమాచారం ఇస్తున్న అధికారుల బృందం.. మరో దఫా ఢిల్లీ వెళ్లనుంది.