ముంబైలో అగ్నిప్రమాదం ఏడు షాపులు దగ్ధం

Published: Tuesday January 09, 2018

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో  ఇటీవల జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు  ముంబై వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. రే రోడ్డులోని చావల్స్ గోడౌన్‌లో నిన్న అర్థరాత్రి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఏడు షాపులు కాలి బూడిదయ్యాయి. à°“ షాపులోని గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతోనే à°ˆ ప్రమాదం చోటుచేసుకున్నట్టు స్థానికులు వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.à°ˆ ప్రమాదంలో ఆస్తినష్టం, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు . ఆరు ఫైరింజన్లు, నాలుగు వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అర్థరాత్రి కావడంతో అప్పటికే దాదాపు ఏడు షాపులకు మంటలు పాకాయి.