పాముల భయం పట్టుకుంది.

Published: Sunday August 19, 2018

కృష్ణా: à°¦à°¿à°µà°¿à°¸à±€à°® వాసులకు ఇప్పుడు పాముల భయం పట్టుకుంది. ఇప్పటికే వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న అక్కడి ప్రజలకు పాముల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. వరదల్లో కొట్టుకొచ్చిన పాములు పలువురిని కాటేశాయి. ఆదివారం ఒక్కరోజే అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి 24 మంది పాముకాటుకు గురైనవారు రావడంతో వారికి ఆసుపత్రి సిబ్బంది వైద్యం అందించారు. అలాగే వరదల్లో చిక్కుకున్న గ్రామాలు మొత్తం అపరిశుభ్రంగా తయారయ్యాయి. వీలైనంత త్వరగా చెత్తా చెదారాన్ని తొలగించకపోతే అంటురోగాలు ప్రభలే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.